Loofah Side Effects: చాలామంది సబ్బు లేదా బాడీవాష్ను బాడీకి అప్లై చేసుకొని లూఫాతో రుద్దుకొని మరీ స్నానం చేస్తుంటారు. అయితే.. లూఫాను ఉపయోగించడం సురక్షితమేనా అంటే.. అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. లూఫాను ఉపయోగించడం వల్ల అది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీనివల్ల సాధారణంగా మీ చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. కానీ.. చాలా గట్టిగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల బాహ్యచర్మం కూడా దెబ్బతింటుందట. దాని వలన రాపిడి, చికాకుతోపాటు చర్మం ఎర్రబడుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. చర్మం మేనిఛాయ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల.. మీరు లూఫాను ఉపయోగిస్తున్నట్లయితే, దాని పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లూఫా వాడే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. తరచుగా లూఫాతో ఒళ్లు రుద్దుకోవడం, పని పూర్తయ్యాక దాన్ని బాత్రూమ్లోనే పైపైన క్లీన్ చేసి అక్కడే ఏదో ఒక చోట పెడుతుంటారు.
అయితే.. అప్పటికే తడిగా ఉన్న లూఫాను తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మళ్లీ వాటిని తిరిగి యూజ్ చేయడం మూలంగా.. మొటిమలు, ఇతర సౌందర్య సమస్యలతోపాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందంటున్నారు. అలాగే.. లూఫాను ఎక్కడైనా దెబ్బతగిలిన చోట లేదా ఓపెన్ కట్ ఉన్న చోట ఉపయోగించినట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీ అలర్ట్ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్ వచ్చే అవకాశం!