Weight Loss Drink : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి వివిధ కారణాల కారణంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడానికి.. ఉదయాన్నే వ్యాయామాలు చేయడంతో పాటు, కఠినమైన డైట్‌ను ఫాలో అవుతారు. అయినా కానీ కొద్దిమందిలో ఎటువంటి రిజల్ట్ కనిపించదు. అలాంటి వారు టెన్షన్ పడకుండా రోజూ ఎక్సర్సైజ్లు చేస్తూ, డైట్ ఫాలో అవుతూనే ఈ డ్రింక్‌ను ట్రై చేయమని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క, నిమ్మరసం, మెంతులతో చేసిన డ్రింక్ తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. అలాగే ఈ డ్రింక్ వల్ల ఎన్నో రకాల హెల్త్ బెన్‌ఫిట్స్ కూడా ఉన్నాయంటున్నారు. మరి ఈ వెయిట్ లాస్ సూపర్ డ్రింక్‌ను ఎలా ప్రిపేర్ చేయాలి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క, నిమ్మరసం, మెంతులతో చేసిన డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు :
నిమ్మకాయ : నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. నిమ్మకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇవి బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది.
దాల్చినచెక్క :దాల్చినచెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇంకా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తీసుకోవడం వల్ల అతిగా తినకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
దాల్చినచెక్కతో ఫేస్‌ప్యాక్ వేసుకోవచ్చా?
మెంతులు : మెంతులు హెపాటోప్రొటెక్టివ్ ప్రభావాలు కలిగి ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మెంతులు తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువు తగ్గేందుకు సాయపడుతుంది. అలాగే లివర్‌ను డిటాక్సిఫై చేయడంలో సహాయపడతుంది.
రోజూ ఈ డ్రింక్ తాగితే ఏం జరుగుతుంది: రోజూ ఉదయాన్నే దాల్చిన చెక్క, నిమ్మరసం, మెంతులతో చేసిన డ్రింక్ తాగడం వల్ల కాలేయం, గుండె ఆరోగ్యంగా ఉంటాయి. అలగే ఇందులో యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు వెయిట్‌ను తగ్గించడంలో తోడ్పడుతాయి. ఇంకా రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2023లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ నిమ్మరసం, దాల్చినచెక్క, మెంతులతో కలిపి చేసిన డ్రింక్ తాగిన వారు బరువు తగ్గినట్లు పేర్కొన్నారు. అలాగే వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో 100 మంది ఊబకాయం ఉన్న వ్యక్తులను 12 వారాల పాటు పరిశీలించారు.
ఈ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం :
కావాల్సిన పదార్థాలు :
- నిమ్మకాయ - 1
- దాల్చిన చెక్క పొడి - 1టీస్పూన్
- మెంతులు - 1టీస్పూన్
- నీరు - 1కప్పు
తయారు చేయు విధానం :
- ముందుగా ఒక గిన్నెలో కప్పు నీరు పోసి వేడిచేసుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు నిమ్మకాయను కట్ చేసి అందులో పిండుకోవాలి.
- అలాగే అందులోకి 1 tsp దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసుకోవాలి.
- తర్వాత కొంచెం మెత్తగా చేసుకున్న మెంతులను వాటర్‌లో వేసుకోవాలి.
- ఇప్పుడు వాటర్‌ను బాగా కలుపుకోవాలి.
- ఈ సూపర్ డ్రింక్ పూర్తిగా చల్లారిన తర్వాత తాగాలి.
పప్పు వండేటప్పుడు చల్లటి నీళ్లను పోస్తున్నారా? - ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా!
ఈ మందులు వాడుతూ మధ్యలో మానేస్తే ఖతమే - ప్రాణాలకే ప్రమాదం!