తెలంగాణ

telangana

ETV Bharat / health

సరిగ్గా నిద్రపోకపోతే కంటి ఆరోగ్యం షెడ్డుకే? ఇవి పాటిస్తే బిగ్​ రిలీఫ్! - Impact Of Sleep On Eye Health - IMPACT OF SLEEP ON EYE HEALTH

Impact Of Sleep On Eye Health : మీ కళ్లు తరచూ పొడిబారుతున్నాయా? కంటి చూపులోపం కూడా ఉందా? అయితే ముందు మీరు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా చూసుకోండి. నిద్రకూ కంటి ఆరోగ్యానికి చాలా సంబంధం ఉంటుందట. అదెలాగో చూద్దాం.

Impact Of Sleep On Eye Health
Impact Of Sleep On Eye Health (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 5:09 PM IST

Impact Of Sleep On Eye Health :తరచూ కళ్లు పొడిబారడం, కంటి చూపులో సమస్యలు తలెత్తడం వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే, ముందుగా మీరు సరిగ్గా నిద్రపోతున్నారో లేదో చెక్ చేసుకోవాలని నిపుణలు చెబుతున్నారు. ఎందుకంటే కంటి ఆరోగ్యం బాగుండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. రోజంతా మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత బిజీగా ఉన్నా రాత్రయ్యేసరికి చక్కగా నిద్రపోవాలి. సరిపడా నిద్ర అందనప్పుడు శరీరంలో చాలా రకాల సమస్యలు వస్తాయి. నిద్ర మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కంటి ఆరోగ్యాన్ని కూడా నిద్ర ప్రభావితం చేస్తుందట.

నిద్రకు కంటి ఆరోగ్యానికి సంబంధం ఏంటి?
శరీరంలోని మిగిలిన భాగాల్లానే కళ్లకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి, పునరుజ్జీవింపజేయడానికి సమయం కావాలి. నిద్రపోయినప్పుడు కళ్లు వాటికవి రిఫ్రెష్ అవుతాయి. ఇది మంచి దృష్టికీ, కంటి పనితీరుకు సహాపడుతుంది. రాత్రిపూట జరిగే ఈ ప్రక్రియలో కళ్లను లూబ్రికేట్ చేయడం సహా రోజంతా పేరుకుపోయిన దుమ్ము, అలర్జీ కారకాలు, చికాకు వంటి వాటిని బయటకుపోతాయి.

నిద్రలేమి కారణంగా వచ్చే కంటి సమస్యలేంటి?
తగినంత నిద్ర లేకపోవడం కంటి సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. వాటిలో ఒకటి డ్రై ఐ సిండ్రోమ్ (dry eye syndrome). సరిపడా నిద్ర అందకపోవడం వల్ల కళ్లు హైడ్రేటెడ్​గా ఉండే అవకాశాలు తగ్గిపోతాయి. ఇవి చికాకు, కళ్లు ఎర్రగా మారడం, పొడిపొడిగా తయారవడం వంటి ఇబ్బందికర సమస్యలు ఎదురవుతాయి. వీటితో పాటు దృష్టిలోపం కూడా ఏర్పడొచ్చు.

నిద్రలేమి కారణంగా తలెత్తే మరో సమస్య ఏంటంటే, ఫ్లాపీ ఐలిడ్ సిండ్రోమ్(floppy eyelid syndrome). కంటికి సరిపడా విశ్రాంతి దొరకనప్పడు వచ్చే సమస్యే ఫ్లాఫీ ఐలిడ్ సిండ్రోమ్. ఈ రుగ్మత నిద్రపోతున్నప్పుడు కనురెప్పలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. సహజ రక్షణ వంటి ప్రకియలకు అంతరాయం కలిగిస్తూ, చికాకు, కార్నియల్ రాపిడికి దారి తీస్తుంది.

నిద్ర నాణ్యత, కంటి చూపు మధ్య ఉండే ఇంకో ప్రత్యక్ష సంబంధం ఏంటంటే, కంటి లెన్స్​ను కేంద్రీకరించే బాధ్యత వహించే కండరాలను నిద్రలేమి ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది ట్రాంసీంట్ మయోపియా(transient myopia), షార్ట్ టర్మ్ నియర్ సైటెడ్ నెస్(short term near sightedness) వంటి దృష్టి సమస్యలకు దారితీస్తుంది. దూరంగా ఉండే వస్తువులను స్పష్టంగా చూసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్య కంటికి విశ్రాంతి దొరినప్పుడే తగ్గుతుంది.

నిద్ర రుగ్మతలు కంటి వ్యాధులకు కారణమవుతాయని కొన్ని పరిశోధనలు బలంగా సూచిస్తున్నాయి. దృష్టి నష్టానికి దారితేసే గ్లాకోమా అబ్స్ట్రక్టివ్ స్లీవ్ అప్నియా(OSA) సంబంధం కలిగి ఉంటాయట. సరైన నిద్రలేకపోవడం వల్ల కంటికి ఆక్సిజన్ సరిగ్గా అందక నరాలు దెబ్బతినడం వల్ల కలిగే సమస్యే ఇది.

కంటి ఆరోగ్యానికి కాపాడుకోవడం ఎలా?
కంటి ఆరోగ్యానికి నిద్రను సానుకూలంగా మార్చుకోవాలంటే నిద్ర విషయంలో కొన్ని అలవాట్లు తప్పనిసరి.

  • నిద్రకంటూ ఓ షెడ్యూల్ పెట్టుకుని టైం సెట్ చేసుకోవాలి.
  • నిద్రపోయే వాతావరణాన్ని కల్పించుకోవడం అంటే బెడ్రూంను చీకటిగా, నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.
  • పడుకునే ముందు కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • గది ఉష్ణోగ్రతను చల్లగా ఉంచుకునేందుకు తగినంత తేమ స్థాయిలను నిర్వహించడం వంటివి చేసి కంటి నిండా నిద్రపోవాలి.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డిప్రెషన్ సమస్య స్త్రీలలోనే ఎక్కువట- ఎందుకంటే? - Women Depression Reasons

మలబద్ధకం ఇబ్బంది పెడుతోందా? మందులకు బదులు ఈ యోగాసనాలు ట్రై చేయండి! - Yoga For Constipation

ABOUT THE AUTHOR

...view details