తెలంగాణ

telangana

ETV Bharat / health

సమ్మర్‌లో క్యారెట్‌ ఫేస్‌ప్యాక్స్ - ఇవి ట్రై చేశారంటే ముఖం తళతళా మెరిసిపోద్ది! - summer beauty tips - SUMMER BEAUTY TIPS

How To Use Carrot Face Pack At Home : వేసవి కాలంలో ఎండవేడి, చెమట కారణంగా స్కిన్‌ డల్‌గా కనిపిస్తుంది. ముఖం కళ కోల్పోతుంది. ఇలాంటి సమయంలో సహజ సిద్ధంగా మీరు మీ చర్మాన్ని మెరిసిపోయేలా చేయాలనుకుంటే.. క్యారెట్‌తో పలు రకాల ఫేస్‌ ప్యాక్‌లను ట్రై చేయొచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

How To Use Carrot Face Pack At Home
How To Use Carrot Face Pack At Home

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 10:46 AM IST

How To Use Carrot Face Pack At Home : క్యారెట్‌ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మనందరికీ తెలిసిందే. అయితే.. క్యారెట్‌ పేస్ట్‌తో మెరిసే చర్మాన్ని పొందడం కూడా పొందోచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ జ్యూస్​తో :
మొదట మీరు కొన్ని క్యారెట్లను తీసుకొని జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అందులోకి బొప్పాయి రసం యాడ్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా శనగపిండి, తేనె వేసుకుని బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత ఫేస్‌కు అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వాష్‌ చేసుకోవాలి. అంతే మీ ఫేస్‌ ఎంతో మెరిసిపోతుంది.

తేనెతో :
ముందుగా అరకప్పు క్యారెట్‌ పేస్ట్‌లో ఒక టీస్పూన్‌ తేనె కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు, చేతులకు అప్లై చేసుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలకు క్లీన్‌ చేసుకోండి.

దోసకాయ పేస్ట్‌ :
ఒక కప్పులో సగం క్యారెట్‌ పేస్ట్‌, సగం దోసకాయ పేస్ట్‌ను వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులోకి ఒక టీస్పూన్‌ తేనె కలపండి. తర్వాత ముఖానికిరాసుకుని ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి.

పుల్లటి పెరుగు :
క్యారెట్‌ పేస్ట్‌లోకి పుల్లటి పెరుగును ఒక రెండు టీస్పూన్‌లు యాడ్‌ చేయండి. తర్వాత ఇందులోకి కొన్ని చుక్కల గ్లిజరిన్‌ను కలిపి ముఖానికి అప్లై చేసుకోండి. తర్వాత చల్లటి నీటితో క్లీన్‌ చేసుకోండి.

మీ స్కిన్‌టోన్‌కి సరిపోయే - లిప్‌స్టిక్​ ఎలా సెలక్ట్​ చేసుకోవాలో తెలుసా? - how to choose lipstick

ఓట్స్‌తో :
క్యారెట్‌ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్‌ ఓట్స్‌ కలిపి చర్మం టాన్‌ అయిన దగ్గర అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల నలుపు మొత్తం పోతుంది.

ఎగ్‌ వైట్‌ :
ఒక గిన్నెలోకి గుడ్డు తెల్లసొన, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, కొద్దిగా క్యారెట్‌ పేస్ట్, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖం, మెడ దగ్గర అప్లై చేయండి. దీనివల్ల చర్మం మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ముల్తానీ మట్టి :
ఒక అరకప్పు క్యారెట్‌ పేస్ట్‌లో, ఒక టేబుల్‌ స్పూన్‌ ముల్తానీ మట్టి, కొద్దిగా పాలను వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేసుకుని, 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులంటున్నారు.

ఇలా క్యారెట్‌తో వివిధ రకాల ఫేస్‌ మాస్క్‌లను అప్లై చేసుకోవడం వల్ల చర్మం అందంగా మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజూ ఆహారంలో క్యారెట్‌ను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

సమ్మర్​లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ! - SUMMER AVOID FOODS

కోడిగుడ్లతో ఇన్ని ప్రయోజనాలా? ఒక ఎగ్ ఉత్పత్తికి ఎంత టైమ్ పడుతుందో తెలుసా? - FACTS ABOUT EGGS

ABOUT THE AUTHOR

...view details