తెలంగాణ

telangana

ETV Bharat / health

టాబ్లెట్స్‌ మింగడం మీవల్ల కావట్లేదా? - ఈ టిప్స్‌ పాటిస్తే ప్రాబ్లమ్ క్లియర్! - easy ways to swallow pills

How To Swallow A Pill Easily : కొంతమందికి టాబ్లెట్స్‌ తీసుకోవడం అస్సలు నచ్చదు. ఎంత ప్రయత్నించినా మింగడం వారి వల్ల కాదు. బలవంతంగా వేసుకుంటే వాంతి చేసుకుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈజీగా మెడిసిన్‌ తీసుకోవచ్చు!

How To Swallow A Pill Easily
How To Swallow A Pill Easily

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 1:51 PM IST

How To Swallow A Pill Easily :మనలో చాలా మంది జ్వరం వల్లనో లేదా ఇంకేదైనా అనారోగ్య కారణాల వల్లనో.. ఎప్పుడో ఒకసారి తప్పకుండా టాబ్లెట్లను మింగాల్సి వస్తుంది. కానీ.. కొంత మందికి మాత్రలను తీసుకోవడం అస్సలు ఇష్టముండదు. ట్యాబ్లెట్లు మింగడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. మరి.. మందులు వేసుకోకపోతే అనారోగ్య సమస్య ఎలా తగ్గుతుంది? అందుకే.. అవస్థలు పడుతూ అతికష్టంగా మందులు వేసుకుంటారు. అయితే.. ఇలా ఇబ్బంది పడేవారు ఈజీగా మాత్రలు మింగడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో..? ట్యాబ్లెట్లు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న ముక్కలుగా..
ట్యాబ్లెట్లు కొంచెం పెద్ద సైజ్‌లో ఉంటే మింగడానికి ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అలా అని వేసుకోకుండా ఉంటే అనారోగ్య సమస్యలు తొలగిపోవు. ఇలాంటప్పుడు ఆ టాబ్లెట్లను రెండు, మూడు చిన్న పీసులుగా కట్‌ చేసుకుని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా మెడిసిన్‌ పూర్తి ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.

నీళ్లు తాగండి..
కొంతమంది మెడిసిన్‌ మింగేటప్పుడు నీళ్లు తాగకుండా అలానే వేసుకుంటారు. దీనివల్ల టాబ్లెట్లలో ఉన్న చేదు గుణం నాలుకకు తెలుస్తుంది. మళ్లీ ఇంకొసారి ఆ మందులను తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా జరగకూడదంటే.. ప్రతిసారీ మందులను తీసుకునే ముందు కొన్ని నీళ్లను తాగాలని నిపుణులంటున్నారు.

అరటి పండుతో కలిపి తీసుకోవచ్చు..
మాత్రలను నేరుగా తీసుకోవడం అస్సలు ఇష్టంలేని వారు.. వాటిని అరటిపండుతో కలిపి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా అరటి పండును ముక్కలుగా చేయాలి. అందులో మెడిసిన్‌ కలిపి మింగేయొచ్చని సూచిస్తున్నారు.

లిక్విడ్‌ మెడిసిన్‌..
ఈ రోజుల్లో చాలా రకాల మందులు ఘన పదార్థాలతో పాటు, లిక్విడ్‌ ఫామ్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు మందులు వేసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది కలిగినట్లు అనిపిస్తే.. మీ డాక్టర్‌ను లిక్విడ్‌ ఫామ్‌లో ఉండే మందులను రాయమని అడగండి. దీనివల్ల మీకు ఇబ్బంది తొలగిపోతుంది.

తల వెనక్కి వంచి వేసుకోండి..
కొన్ని మందులు చేదుగా ఉంటాయి.. మరికొన్ని వెగటు వాసన వస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందికరమైన మందుల ప్రభావం.. నాలుకకు తగిలినప్పుడు ఎక్కువగా తెలుస్తుంది. ఇలాంటప్పుడు అస్సలే తీసుకోవాలని అనిపించదు. కాబట్టి.. టాబ్లెట్స్‌ వేసుకునే ముందు కొద్దిగా తలను వెనక్కి వంచి వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల నేరుగా గొంతులో టాబ్లెట్ వేసుకోవచ్చని.. నాలుకకు తగిలే ఛాన్స్ తక్కువని అంటున్నారు.

అలవాటు చేసుకోండి..
జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యలు రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతాయి. కానీ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సమయానికి మెడిసిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, మందుల రంగు, రుచి, వాసన ఎలా ఉన్నా తప్పుకుండా అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. మీకు మందులు ఎలా తీసుకుంటే ఈజీగా అనిపిస్తుందో.. ఆ విధనాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే డాక్టర్‌ సూచించిన విధంగానే సమయానికి మందులను తీసుకోవాలని సూచిస్తున్నారు.

విగ్ పెట్టుకునే అలవాటు ఉందా? - ఈ టిప్స్ పాటిస్తే స్టైల్ అదిరిపోద్ది!

లిప్‌బామ్‌, లిప్‌గ్లోస్‌ - పెదాలకు ఏంది మంచిది?

అలర్ట్ : మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - గుండెపోటుకు దారితీయొచ్చు!

ABOUT THE AUTHOR

...view details