తెలంగాణ

telangana

ETV Bharat / health

చలికాలంలో జ్వరంతో ఇబ్బందా? ఇది తాగితే వెంటనే తగ్గిపోతుందట!

-జ్వరానికి ఆయుర్వేద ఔషధంతో చెక్ -ఇది తాగితే సరిపోతుందని వైద్యుల సలహా

Fever Treatment In Ayurveda
Fever Treatment In Ayurveda (ETV Bharat)

By ETV Bharat Health Team

Published : Nov 29, 2024, 1:20 PM IST

Fever Treatment In Ayurveda:చలికాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా జ్వరం చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ క్రమంలోనే దీనిని తగ్గించుకోవడానికి అనేక రకాల మందులు వేసుకుంటారు. కానీ ఇంట్లోనే ఉండే ఈ పదార్థాలతో ఔషధం తయారు చేసుకుని తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇంకా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా కూడా దీనిని తీసుకోవచ్చని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గాయత్రీ దేవీ వివరించారు. ఈ నేపథ్యంలో ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 50 గ్రాముల శొంఠి చూర్ణం
  • 50 గ్రాముల మిరియాల చూర్ణం
  • 50 గ్రాముల ధనియాల చూర్ణం
  • 50 గ్రాముల పసుపు
  • 50 గ్రాముల తులసి చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో 100 మిల్లీ లీటర్లు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
  • ఇవి వేడయ్యే లోపు మరో గిన్నెలో శొంఠి చూర్ణం, మిరియాలు, ధనియాలు, పసుపు, తులసి చూర్ణం వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు మనం కలిపిన చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకుని ఈ నీటిలో వేసుకుని మరిగించుకోవాలి.
  • బాగా మరిగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి వడబెట్టుకుంటే ఆయుర్వేద ఔషధం రెడీ

ఎప్పుడు? ఎంత మోతాదులో తీసుకోవాలి?
చలికాలంలో జ్వరం వచ్చినప్పుడు తగ్గడానికి సుమారుగా 40-50 మిల్లీ లీటర్ల పరిమాణంలో మూడు పూటాల తీసుకోవాలని చెబుతున్నారు. ఇంకా జ్వరం రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుకోవచ్చని అంటున్నారు. ఇలాంటి వారు ఉదయం, సాయంత్రం 30 మిల్లీ లీటర్ల పరిమాణంలో తీసుకోవాలని వివరించారు.

శొంఠి: చలికాలంలో వచ్చే కఫాన్ని తగ్గించడంలో శొంఠి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంకా జీర్ణశక్తిని మెరుగుపరిచి అజీర్తి సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మిరియాలు: మిరియాలను అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా వాడుతుంటారు. ముఖ్యంగా ఇన్​ఫెక్షన్లు తగ్గడానికి, శరీరంలోని మలినాలు బయటకు వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇందులో అజీర్తి సమస్యను తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు.

పసుపు: పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్ ఇన్​ఫెక్షన్లు, వైరస్​లను తగ్గించడానికి పసుపు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

తులసి: ఆయుర్వేద ఔషధాల తయారీలో తులసి మొక్కను అనేక రకాలుగా వాడుతుంటారు. వైరల్​ ఇన్​ఫెక్షన్​, జ్వరాలు తగ్గడానికి తులసి చాలా సహాయపడుతుందని అంటున్నారు.

ధనియాలు: జరాన్ని తగ్గించడంలో ధనియాలు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. జ్వరం వచ్చినప్పుడు ధనియాల కషాయం చేసుకుని తాగితే సరిపోతుందని అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి

మీ జుట్టు తెల్లపడుతోందా? ఇలా చేస్తే వెంటనే నల్లగా మారుతాయట!

ABOUT THE AUTHOR

...view details