How To Control Pimples On Back : చాలా మందికి ముఖంపైన మొటిమలు వస్తుంటాయి. వీటిని తగ్గించుకోవడానికి కొంతమంది నాచురల్ టిప్స్ పాటిస్తే.. మరికొందరు క్రీమ్స్, లోషన్స్ ఉపయోగిస్తారు. అయితే, కొంతమంది ఫేస్తోపాటుగా వీపు పైనా మొటిమలు, కురుపులు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సమస్యతో బాధపడేవారు వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతుంటారు. మరి.. వీటిని తగ్గించుకోవడానికి ఏం చేయాలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్ శైలజ సూరపనేని' కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
నూనెలు ఎక్కువగా విడుదలవడంతో :
మన శరీరంలో ముఖంతో పోలిస్తే.. బాడీ మీద చర్మరంధ్రాలు పెద్దగా ఉంటాయి. వీటి నుంచి ఎక్కువగా నూనెలు విడుదలవుతాయి. అయితే, ఈ నూనెలు అధికంగా విడుదలవ్వడం వల్ల మృతకణాలు, దుమ్ము.. చర్మరంధ్రాల్లో పేరుకుపోయి, వాటిల్లోకి బ్యాక్టీరియా చేరి మొటిమలు, కురుపులు తయారవుతాయట. అలాగే చెమట, జిడ్డు కారణంగా కూడా వీపు పైన కురుపులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి.. వ్యాయామం చేసినా, బయటికి వెళ్లొచ్చినా వెంటనే స్నానం చేయాలని సూచిస్తున్నారు.
వీపు పైన మొటిమలతో ఇబ్బంది పడేవారు ఆయిల్ బేస్‌డ్ స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్‌ను వాడొద్దని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు. వీటికి బదులుగా నాన్‌కమడోజెనిక్ ఉత్పత్తులను వాడడం మంచిదట. అలాగే పగలు బెంజైల్ పెరాక్సైడ్, క్లిండమైసిన్, నైట్ టైమ్‌లో రెటినాల్ క్రీములు వీపు పైన అప్లై చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ సమస్య ఉంటే యాంటీబయాటిక్స్ వాడాలి. ఒకవేళ ఇన్ని ప్రయాత్నాలు చేసినా కూడా సమస్య తగ్గకపోతే లేజర్, కెమికల్ పీల్స్ చేయించుకోవాలి.
ఈ ఫేస్ ప్యాక్‌ను ఎప్పుడైనా ట్రై చేశారా? - ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే మాయం!