తెలంగాణ

telangana

స్టెయిన్​లెస్‌ స్టీల్‌ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా! - How To Clean Stainless Steel Sink

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 3:43 PM IST

How To Clean Sink : చాలా మంది మహిళలకు వంట చేయడం కన్నా.. వంటింట్లోని సింక్​ను క్లీన్​ చేయడం పెద్ద తలనొప్పి. ఎందుకంటే.. సింక్‌ని ఎన్ని సార్లు శుభ్రం చేసినా కూడా.. మళ్లీ మరకలు పడుతుంటాయి. ముఖ్యంగా స్టెయిన్​ లెస్ సింక్​​ విషయంలో క్లీనింగ్​ వెరీ టఫ్​. అయితే సింక్​ను రోజూ క్లీన్​ చేసినా వారానికి ఒకసారి ఈ టిప్స్​ పాటిస్తూ డీప్​ క్లీన్​ చేస్తే కొత్తదానిలా మెరుస్తుందని అంటున్నారు.

Clean Stainless Steel Sink
How To Clean Stainless Steel Sink (ETV Bharat)

How To Clean Stainless Steel Sink : ప్రస్తుత రోజుల్లో కిచెన్​లో సింక్​ కామన్ అయ్యింది. గిన్నెలు శుభ్రం చేయడానికి.. కూరగాయలు కడగడానికి.. చేతులు శుభ్రం చేసుకోవడానికి.. ఇలా ప్రతి చిన్న పనికి సింక్​నే ఉపయోగిస్తుంటారు. వీటిల్లో కూడా చాలా రకాలే ఉన్నాయి. ముఖ్యంగా స్టెయిన్​ లెస్​ స్టీల్​ సింక్​ల వాడకం ఎక్కువైంది. అయితే వీటి వాడకం ఎలా ఉన్నా.. మురికి మాత్రం తొందరగా పట్టేస్తుంది. ఎన్నిసార్లు క్లీన్​ చేసినా.. కొద్దిసేపటికే జిడ్డు పట్టేస్తుంది. అందుకే ఈ స్టీల్​ సింక్​లను శుభ్రం చేయడానికి చాలా మంది రసాయనాలు కలిగిన క్లీనర్‌లను వాడుతుంటారు. అయితే, ఇలా తరచూ కెమికల్స్‌ ఉండే వాటిని ఉపయోగించడం వల్ల సింక్​ డ్యామేజ్​ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి స్టెయిన్​ లెస్​ స్టీల్​ సింక్‌ని డైలీ శుభ్రం చేసినా.. వారానికి ఓ సారి డీప్​ క్లీన్​ చేయాలని సూచిస్తున్నారు. అందుకోసం ఈ టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు.

బేకింగ్ సోడా :ముందుగా కొద్దిగా బేకింగ్‌ సోడాను సింక్‌పై చల్లుకోండి. ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ కూడా చల్లుకోండి. ఇప్పుడు ఒక స్క్రబర్‌ లేదా బ్రష్‌ సహాయంతో బాగా క్లీన్‌ చేయండి. తర్వాత వాటర్‌తో సింక్‌ని క్లీన్‌ చేస్తే సరిపోతుంది. ఎంతో ఈజీగా సింక్​ క్లీన్​ అవ్వడమే కాదు కొత్తదానిలా మెరుస్తుంది. 2019లో 'జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌ల ఉపరితలాలపై కఠినమైన మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్ విశ్వవిద్యాలయం(Nanjing University)లో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌ డాక్టర్ Y. Zhang పాల్గొన్నారు. బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపరితలాలకు ఎటువంటి నష్టం జరగదని వారు పేర్కొన్నారు.

సూపర్​: కట్​ చేసిన కొద్దిసేపటికే యాపిల్​ ముక్కలు రంగు మారుతున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే గంటల పాటు ఫ్రెష్​!

నిమ్మరసం :సింక్‌పై మరకలు ఎక్కువగా ఉంటే.. నిమ్మరసాన్ని సింక్‌పై పిండి కొద్ది సేపటి తర్వాత బ్రష్‌తో క్లీన్‌ చేయండి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది. అంతే సింక్‌ కొత్తదానిలా మెరుస్తుంది.

ఫ్రిడ్జ్‌ డోర్‌ ఓపెన్ చేయగానే దుర్వాసన వస్తోందా ? ఈ టిప్స్​ పాటిస్తే క్లీన్​ అండ్​ ఫ్రెష్​ పక్కా!

వైట్‌ వెనిగర్‌ :ముందుగా స్ప్రే బాటిల్‌లో వైట్‌ వెనిగర్‌, నీళ్లను సమానంగా తీసుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన సింక్‌పైన వెనిగర్‌ లిక్విడ్‌ని స్ప్రే చేయండి. ఇప్పుడు మృదువైన స్పాంజ్ లేదా వస్త్రంతో సింక్‌ని తుడవండి. ఇలా చేస్తే.. సింక్‌పైన ఉన్న మరకలు పోవడంతో పాటు, బ్యాడ్‌ స్మెల్‌ కూడా తగ్గిపోతుందని నిపుణులంటున్నారు.

చూశారుగా.. ఈ చిట్కాలు పాటిస్తూ సింక్‌ని వారానికి డీప్​ క్లీన్ చేయడం వల్ల ఎప్పుడూ కొత్తదానిలా మెరుస్తుంది. అయితే స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌లను శుభ్రం చేయడానికి స్టీల్ స్క్రబర్‌లు ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిని వాడటం వల్ల గీతలు పడొచ్చు. కాబట్టి, స్టెయిన్‌లెస్ స్టీల్ సింక్‌లను శుభ్రం చేయడానికి సున్నితమైన స్క్రబర్‌లను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

సింక్‌లో నీళ్లు నిలిచిపోయాయా ? ఈ టిప్స్​ పాటిస్తే ప్రాబ్లం సాల్వ్​!

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

ABOUT THE AUTHOR

...view details