ETV Bharat / health

ఇనుప కడాయిలో కూరలు వండుతున్నారా? ఈ సమస్యలు వచ్చే అవకాశమట! - IS CAST IRON GOOD FOR COOKING

-మీ ఇంట్లో ఇనుప కడాయి వాడుతున్నారా? -అయితే, ఈ కూరలు వండకూడదన్న నిపుణులు!

iron kadai is good for cooking
iron kadai is good for cooking (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 5 hours ago

Is Iron Kadai is Good for Cooking: కూరలు, వేపుళ్లు ఇలా ఏ వంటకమైనా చాలా మంది ఇనుప కడాయిలో చేస్తుంటారు. నాన్‌స్టిక్‌ ప్యాన్‌లు వచ్చినా సరే.. ఎక్కువ మంది ఇనుప కడాయిలోనే వండుతుంటారు. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలను మాత్రం ఇనుప కడాయిలో వండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా వండడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుల్లని పదార్థాలు: టమాటా, చింతపండు, నిమ్మకాయలు వాడి చేసే వంటలు ఇనుప కడాయిలో చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఎసిడిక్‌ గుణాలు ఉండడం వల్ల అవి ఇనుముతో రియాక్ట్‌ అయ్యి.. ఆ లోహం కరిగి వంటలో కలుస్తుందని వివరిస్తున్నారు. 2020లో Journal of Food and Nutrition Researchలో ప్రచురితమైన "Acidic Food and Iron Cookware: A Review of the Chemical Reactions and Nutritional Implications" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

వంకాయ, పాలకూర: ఇవేకాకుండా వంకాయ, పాలకూరని కూడా ఇనుప మూకుడులో వండకూడదని అంటున్నారు. వంకాయలో కూడా కొద్దిమొత్తంలో ఎసిడిక్‌ గుణాలు ఉంటాయని తెలిపారు. అలానే పాలకూరలోనూ ఆక్సాలిక్‌ యాసిడ్‌ ఉంటుందని.. ఇవి ఐరన్‌తో కలిసినప్పుడు కూర నలుపురంగులోకి మారడమేకాక, లోహపు రుచి వస్తుందని పేర్కొన్నారు.

గుడ్డు, బీట్‌రూట్‌: ఇంకా కోడిగుడ్డును కూడా ఇందులో వండకూడదని నిపుణులు చెబుతున్నారు. తెల్లసొనలో ఉండే సల్ఫర్‌.. ఇనుముతో రసాయనిక చర్య జరపడం వల్ల కూర బూడిదరంగులోకి మారడమే కాకుండా రుచీ తగ్గుతుందని అంటున్నారు. ఇక, బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో ఐరన్‌ ఉంటుందని.. ఇది కడాయిలోని ఐరన్‌తో కలిసి ఆహారానికి ఉండే సహజరుచి కోల్పోయేలా చేస్తుందని వివరిస్తున్నారు. ఇంకా పిండితో తయారయ్యే పాస్తా లాంటివి కూడా కడాయి అడుగుభాగంలో అతుక్కునిపోతాయని సూచిస్తున్నారు. ఫలితంగా అవి మాడిపోయి రుచి తగ్గుతుందని తెలిపారు. ఇవేకాకుండా తీపి పదార్థాలను ఇనుప కడాయిలో చేస్తే వాటి రుచి, అరోమా పోతుందని వెల్లడిస్తున్నారు.

ముఖ్యంగా ఇనుప కడాయి కొన్నాక కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని వాడటానికి ముందుగా కాస్త నూనె పట్టించి రుద్ది శుభ్రపరచాలని చెబుతున్నారు. అయితే, కడాయిలో ఉండే ఐరన్‌ వంటల్లోకి ఎంత మొత్తంలో వస్తుందనేది తెలుస్తుందనే విషయం మాత్రం.. మనం వండే పదార్థాల్లో ఎంత ఎసిడిటీ ఉంది? ఎంతసేపు వండాం? కడాయి కండిషన్‌ ఎలా ఉంది? వీటిపైనే ఆధారపడుతుందని వివరిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు 6-6-6 వాకింగ్ రూల్​ తెలుసా? ఇలా చేస్తే ఫిట్​గా, అందంగా ఉంటారట! గుండె జబ్బుల ముప్పు తక్కువ!!

పాలు తాగితే బరువు తగ్గుతారా? షుగర్, ఊబకాయం సమస్యలకు చెక్ పెడుతుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.