Virat Anushka At Vrindavan : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దంపతులకు ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువే. ఎప్పుడు సమయం దొరికినా ఈ జంట ఆధ్యాత్మిక యాత్రకు వెళ్తుంటుంది. తాజాగా విరాట్- అనుష్క జంట తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ధామ్ ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకున్నారు. మహారాజ్‌తో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మహారాజ్ దగ్గరికి వెళ్లగానే విరాట్, అనుష్క సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని చాటుకున్నారు. బృందావన్ ధామ్ నిర్వాహకులు దంపతులను శాలువాతో సత్కరించారు. తర్వాత అనుష్క మహారాజ్‌తో మాట్లాడారు. 'మహారాజ్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనున్నాను. కానీ, ఇక్కడున్న వాళ్లు అడిగేశారు. మాలో మేమే మీతో మాట్లాడినట్లు అనిపించింది. మీ నుంచి కాస్త ప్రేమ, భక్తి చాలు మాకు' అని అనుష్క అన్నారు.
ఇక విరాట్ దంపతులతో మహారాజ్ కూడా మాట్లాడారు. జీవితంలో ఎంతో సాధించిన తర్వాత కూడా భక్తి మార్గంలో నడవడాన్ని ఆయన ప్రశంసించారు. తాము అనుకున్నవన్నీ దక్కాలని ఆశించారు. ఈ క్రమంలోనే విరాట్‌పై మహారాజ్ ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ ఆద్భుతంగా ఆడినప్పుడు భారతదేశం మొత్తం ఆనందంగా ఉంటుందని అన్నారు. అతడు విజయం సాధిస్తే, దేశమంతా టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటుందని తెలిపారు.
ఈ వీడియోలో కూడా విరాట్ తమ పిల్లలు వామిక, అకాయ్ ముఖాలు కనబడకుండా జాగ్రాత్త పడ్డారు. కానీ, స్వామీజీతో మాట్లాడుతున్న సమయంలో చిన్నారులు అటు, ఇటు తిరగడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
Virat Kohli, Anushka Sharma & their children at Shri Premanand Ji Maharaj ♥️
— Johns. (@CricCrazyJohns) January 10, 2025
- Video of the Day...!!!! pic.twitter.com/rHut3isM35
కాగా, ఈ జంట రెండేళ్ల కిందట కూడా ఈ ఆశ్రమాన్ని సందర్శించారు. విరాట్ ఎప్పుడైనా కెరీర్లో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆధ్యాత్మిక యాత్ర చేస్తాడు. అయితే ప్రస్తుతం ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్, తాజాగా ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.