ETV Bharat / state

మీ ఇంట్లోకి పాము వచ్చిందా? - అయితే ఇలా చేయండి - SNAKE CATCHING SOCIETIES IN HYD

హైదరాబాద్​లో పాములు పట్టుకునే స్సేక్ క్యాచింగ్​ సొసైటీలు - సమాచారం ఇవ్వగానే కేవలం 30 నిమిషాల్లో అందుబాటులోకి

Many Snake Catching Societies Available In Hyderabad
Many Snake Catching Societies Available In Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

Many Snake Catching Societies Available In Hyderabad : గ్రేటర్ రాజధాని రోజురోజుకూ విస్తరిస్తోంది. శివారు ప్రాంతాల్లో నివాసాలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా అప్పటివరకు ఆ ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణాలకు నివాస సమస్య వస్తోంది. అందుకే చాలా శివారు ప్రాంతాల్లో పాముల బెడద పెరిగిపోతోంది. ఇటీవలి కాలంలో ఈ సమస్య మరి ఎక్కువ అవుతోంది. ఇలాంటి సమస్య మీకు వస్తే పామును చూసి భయపడటం కానీ, చంపడం కానీ చేయకుండా మాకు కాల్ చేయండి అంటోంది ఫ్రెండ్స్​ స్నేక్ సొసైటీ.

  • హైదరాబాద్​లో ప్రధానంగా సేవలు అందిస్తున్న ఫ్రెండ్స్​ స్నేక్ సొసైటీ ఫోన్​ నంబరు : 8374933366
  • ఈ సంస్థకు చెందిన 120 మందికిపైగా వాలంటీర్లు నగరంలో ఉన్నారు. హైదరాబాద్​లో ఎక్కడ నుంచి ఫోన్​ వచ్చినా కేవలం 30 నిమిషాల్లోనే చేరుకుంటారని స్నేక్​ సొసైటీ వారు చెబుతున్నారు.

అడవుల నరికివేత ఫలితంగా వన్యప్రాణాలు జనవాసాల్లోకి వస్తున్నాయి. నగరంలోకి కూడా పాములు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఒక ప్రాంతంలో సిగ్నల్​ దగ్గరకు వచ్చిన పాము నానా హంగామా చేసింది. దానికి సంబంధించిన వీడియోలు సోషల్​ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇటీవల హయత్​నగర్​కు చెందిన సింధూ గృహిణి. ఇంట్లో పనులు చేసుకుంటున్న తనకు పాము కనిపించగానే వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆయన సామాజిక మాధ్యమంలో చూసిన స్నేక్ క్యాచర్స్​ గుర్తుకువచ్చారు. ఫోన్ చేయడంతో వారు వచ్చి పామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించి జనారణ్యం లేని ప్రాంతంలో విడిచిపెట్టారు.

Many Snake Catching Societies Available In Hyderabad
పామును పట్టుకున్న స్నేక్​ సొసైటీ సభ్యుడు (ETV Bharat)

మీ ఇంట్లో పాము దూరిందా? - ఈ నెంబర్​కు కాల్​ చేయండి - అరగంటలో పట్టేస్తారు!

పాములు ఇళ్లు, కార్యాలయాలు, వ్యవసాయ ప్రాంతాల్లోకి పాములు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలో తెలియక చాలామంది తమ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో వాటిని చంపేస్తున్నారు. నగరంలో స్నేక్​ క్యాచర్​ సొసైటీలు అందుబాటులో ఉన్నాయి. ఫోన్​ చేస్తే చాలు అరగంటలోపే పట్టుకుని అటవీ ప్రాంతాల్లో వదిలేస్తూ మనుషులతో పాటు పాములు ప్రాణాలు కూడా కాపాడుతున్నారు.

"పాములు ఇంట్లోకి, కార్యాలయాల్లోకి రావడానికి కారణం పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటేనే వస్తాయి. అలాంటి ప్రాంతాల్లోకి ఎలుకలు, ఇతర కీటకాలు తిరగటం వల్ల వాటి కోసం వస్తుంటాయి. పాములను చూసి గాబరా పడకుండా, వాటిని ఏం అనకుండా ఉండడానికి ప్రయత్నించండి. మాకు సమాచారం ఇవ్వండి." - అవినాశ్, జనరల్‌ సెక్రెటరీ, ఫ్రెండ్స్‌ స్నేక్‌ సొసైటీ

కింగ్ కోబ్రాతో పెంపుడు కుక్కల ఫైట్​- యజమాని ప్రాణాలు కాపాడినా!

ఈ పాము పడగ విప్పితే మొత్తం బంగారమే! - మీరూ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.