తెలంగాణ

telangana

ETV Bharat / health

ఒక్క చెంచా తేనెతో ఎంతో మేలు- సమ్మర్​లో హనీ ఎందుకు తీసుకోవాలో తెలుసా? - Honey Usage In Summer - HONEY USAGE IN SUMMER

Honey Benefits In Summer : వేసవి కాలంలో రోజూ కనీసం ఒక చెంచా తేనె అయినా తప్పకుండా తీసుకోవాలట. అయితే ఎందుకు తీసుకోవాలి? సమ్మర్​లో హనీ మీ శరీరానికి ఎలా సహాయపడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Honey
Honey (Source: Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 6:04 AM IST

Honey Benefits In Summer :తేనెతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సహజమైన తీపిదనం కలిగిన తేనె యాంటీ డిప్రెసెంట్, యాంటీ కన్వల్సెంట్, యాంటీ యాంగ్జయిటీ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. పిల్లల మేథో సామర్థ్యాన్ని పెంచడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మానసిక ఆరోగ్య ప్రయోజనాల సంగతి పక్కన బెడతే తేనెతో శారీరక ఆరోగ్యానికి అద్భుతమైన ఫలితాలుంటాయి.

ప్రతి రోజూ తేనెను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని పొందగలుగుతాం. చర్మ రక్షణలోనూ తేనె చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజూ తేనెను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నేరుగా కాకపోయినా టీలో లేదా గోరు వెచ్చటి నటీలో కాస్త తేనెను కలిపి తీసుకోవచ్చు. వేసవిలో రోజూ తేనెను ఎందుకు తీసుకోవాలి? అలా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

నిర్విషీకరణ
శరీర నిర్విషీకరణకు తోడ్పడే ఆహర పదార్థాల్లో తేనె ఉత్తమమైనది. దీంట్లో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి హాని కలిగించే రాడికల్స్ నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతాయి. అదనంగా తేనె మీ ఆహారాలకు, పానీయాలకు సహాజమైన తీపి దనాన్ని అందిస్తుంది. చక్కెరకు చక్కటి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండేందుకు తేనె చాలా ఉపయోగపడుతుంది.

ఇమ్యూనిటీ బూస్టర్
తేనెలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. ప్రతి రోజూ రెండు చెంచాల తేనె తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది.

శక్తిదాయకం
తేనె వంద శాతం సహజమైన పదార్థం. మీరు ప్రతి రోజూ టీ, కాఫీలు, పండ్ల రసాల్లో ఉపయోగించే చక్కెరను ఇది చక్కటి ప్రత్యమ్నాయంగా పనిచేస్తుంది. తీపిదనంతో పాటు శక్తిని పెంచడంలోనూ తేనె సహాయడుతుంది. సాధారణ చక్కెర శరీరంలో శక్తి క్షీణించేలా చేస్తుంది.

జీర్ణక్రియకు మంచిది
తేనె జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి, పేగుల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే మలబద్దకాన్ని నివారించడంలో, మృదువైన ప్రేగుల కదలికలను పెంచడంలో సహాయపడే లక్షణాలు తేనెలో మెండుగా లభిస్తాయి. ఇది మీ ఆహారం సులభంగా జీర్ణం అవడంలోనూ సహాయపడుతుంది. ఫలితంగా జీవక్రియ మెరుగవుతుంది. శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

జలుబుకు ఉపశమనం
తేనెలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్ వంటి వాటిని వేగంగా తగ్గిస్తుంది.

ఫేస్ బ్యూటీనెస్​ కోసం తేనెను ఎలా ఉపయోగించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - Honey Using Tips In Telugu

పెరుగు, తేనె కలిపి తీసుకున్నారా? ఇన్ఫెక్షన్లు దూరం.. ఎముకలు దృఢం.. ఇంకెన్ని ప్రయోజనాలో..

ABOUT THE AUTHOR

...view details