Health Benefits of Muskmelon: కర్బూజను పోషకాల పవర్ హౌస్ అని అంటారు. ఇందులో విటమిన్-సి, ఎ, కె, బి కాంప్లెక్స్‌లు పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం, లైకోపీన్ కూడా ఇందులో ఉంటాయి. కంటి ఆరోగ్యానికి, ఎముకల ఆరోగ్యానికి, రక్తం గడ్డకట్టడానికి దోహదం చేస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందించడంలోనూ, జీవక్రియను, నాడీవ్యవస్థను మెరుగ్గా ఉంచడంలోనూ కర్బూజ సహాయపడుతుంది. ఇక ప్రయోజనాలు చూస్తే..
హైడ్రేట్:కర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వేడి వాతావరణంలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచడానికి, జీవక్రియకూ సహాయపడుతుంది. 2023లో USDA నేషనల్ న్యూట్రియంట్ డేటాబేస్ ఫర్ స్టాండర్డ్ రిఫరెన్స్ ప్రకారం.. కర్బూజలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఇది వేడి వాతావరణంలో బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుందని పేర్కొన్నారు.
యాంటీ ఆక్సిడెంట్లు:కర్బూజలో బీటా కెరోటిన్, విటమిన్-సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
మీ పొట్టలో సమస్యా? - అయితే అది ఐబీఎస్ కావొచ్చు!
కంటి ఆరోగ్యం:మస్క్ మిలన్లో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-ఎ గా రూపాంతరం చెందుతుంది. విటమిన్-ఎ రెటీనా పనితీరుకు ముఖ్యమైనది. కర్బూజను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం:కర్బూజలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. పేగు కదలికలను సులభం చేస్తుంది. గట్ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.