Health Benefits of Jaggery :గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బ్యాక్ పెయిన్ దాకా.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు జనాన్ని వేధిస్తుంటాయి. అయితే.. చిన్న బెల్లం ముక్కతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
బెల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్ వంటి ఖనిజాలుంటాయి. అలాగే విటమిన్ ఎ, బి1, బి2, బి5, బి6, సి వంటి విటమిన్లు పుష్కంగా ఉన్నాయి. బెల్లంలోని క్యాల్షియం ఎముకలు దృఢంగా ఉండడానికి సహాయం చేస్తుంది. అలాగే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' నిపుణుల బృందం కూడా వెల్లడించింది. (రిపోర్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.) అయితే, కేవలం బెల్లం మాత్రమే కాకుండా ఇతర పదార్థాలతోనూ కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది. అదేలా అంటే..
ఆ సమయంలో :
కొంతమంది అమ్మాయిలు పీరియడ్ టైమ్లో కడుపునొప్పి, నడుం నొప్పి.. వంటి శారీరక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొన్ని కాకర ఆకులు, ఒక చిన్న బెల్లం ముక్క.. ఈ మూడింటినీ కలిపి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డైలీ రెండుసార్లు వారం రోజుల పాటు తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
ఆయుర్వేద మందుల్లోనూ :
జలుబు, పొడి దగ్గు, ఆస్తమా.. లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్వేద మందుల్లో బెల్లాన్ని వాడతారు. అయితే, ఈ ఇబ్బందులున్న వారు రోజూ ఓ చిన్న బెల్లం ముక్క తింటే మేలు కలుగుతుందట.
పొడి దగ్గుకు చిట్కా :
తరచుగా పొడి దగ్గుతో బాధపడేవారు ఒక గ్లాసు బెల్లం పానకంలో కొన్ని తులసి ఆకులు వేసి కలపండి. దీనిని బాగా మరగనిచ్చి చల్లారనివ్వాలి. అనంతరం ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకుంటే సమస్య తగ్గిపోతుంది.
మరిన్ని :
- కడుపులో మంట, గ్యాస్ట్రిక్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు బెల్లం చక్కటి ఔషధమని నిపుణులు అంటున్నారు. రోజూ ఓ బెల్లం ముక్క తినడం ఈ సమస్య తగ్గిపోతుందని చెబుతున్నారు.
- బెల్లంలో ఉండే మెగ్నీషియం ఖనిజం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి.
- మైగ్రెయిన్తో బాధపడేవారు బెల్లం, నెయ్యి.. ఈ రెండింటినీ సమపాళ్లలో కలిపి తీసుకుంటే తలనొప్పి దూరం చేసుకోవచ్చు.
- బాడీలో ఎక్కడైనా బాగా నొప్పిగా అనిపించినట్లయితే.. నెయ్యిలో వేసిన బెల్లం ముక్కను నొప్పి ఉన్న చోట కాసేపు ఉంచితే ఉపశమనం లభిస్తుందట.
- కీళ్ల నొప్పులతో బాధపడేవారికి బెల్లం చక్కగా పని చేస్తుంది. ఇందుకోసం.. ప్రతిరోజు అల్లం, బెల్లం.. రెండూ సమపాళ్లలో కలిపి తీసుకుంటే నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు.
- కొంతమందికి ఎక్కిళ్లు తరచూ వస్తుంటాయి. ఈ సమస్యతో బాధపడేవారికి బెల్లం దివ్యఔషధంగా పని చేస్తుంది. ఇందుకోసం అల్లాన్ని ఎండబెట్టి పొడి చేయాలి. అందులో కాస్త బెల్లాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తాగాలి. దీంతో ఎక్కిళ్లు వెంటనే తగ్గుతాయి.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి:
మీరు తింటున్న బెల్లం మంచిదేనా? - కల్తీని ఇలా చెక్ చేయండి!
మీరు రోజు చపాతీలు తింటున్నారా? ఇలానే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?