తెలంగాణ

telangana

ETV Bharat / health

నడుము, కీళ్ల నొప్పులతో నరకం చూస్తున్నారా? - చిన్న అల్లం ముక్కతో చెక్ పెట్టేయండి! - Ginger Health Benefits

Ginger Health Benefits : మిమ్మల్ని తరచుగా కీళ్ల నొప్పులు, నడుంనొప్పి, తలనొప్పి లాంటి సమస్యలు వేధిస్తున్నాయా? వీటిని తగ్గించుకోవడానికి తరచూ పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? అయితే, ఇకపై వాటికి స్వస్తి పలకండి. నేచురల్​గా వంటింట్లో దొరికే అల్లంముక్కతో ఈజీగా తగ్గించుకోండంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Health Benefits Of Ginger
Ginger Health Benefits (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 10:57 AM IST

Health Benefits Of Ginger :ప్రస్తుత రోజుల్లో చాలా మందిని కాళ్లు, కీళ్ల నొప్పులు, రకరకాల ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్​ వేధిస్తున్నాయి. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నారు. కానీ.. పెయిన్​ కిల్లర్స్ భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అలాకాకుండా వంటింట్లో లభించే చిన్నఅల్లం(Ginger) ముక్కతో ఈ నొప్పులకు ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా అల్లంలోని జింజెరాల్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలెక్కువ. ఇవి ఆర్థరైటిస్, కండరాల నొప్పులతో పాటు నెలసరి ఇబ్బందులనూ తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అలాగే జింజర్​లో కీళ్ల ఆరోగ్యానికి అవసరమయ్యే మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, బీ6 విటమిన్లు అల్లంలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అల్లాన్ని డైలీ డైట్​లో భాగం చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు.

2001లో "రుమటాలజీ" అనే జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులకు 4 వారాల పాటు రోజుకు 2 గ్రాముల అల్లం ఇచ్చారు. ఫలితంగా వారిలో ఆర్థరైటిస్ నొప్పులు తగ్గడమే కాకుండా కీళ్ల పనితీరు మెరుగుపడినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్​లోని యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ E. విలియమ్స్ పాల్గొన్నారు. అల్లంలోని ఔషధ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

ఉదయాన్నే కాసిన్ని వేడినీళ్లలో అల్లం, పసుపు(Turmeric)వేసి మరిగించుకుని తాగినా, అల్లం టీ తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. నొప్పులతో పాటు జలుబూ, దగ్గుల నుంచీ ఉపశమనం దొరుకుతుంది. ట్యాబ్లెట్లు వేసుకోవడం, క్రీమ్‌లు రాయడం కంటే వంటింట్లో దొరికే అల్లాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇవేకాదు.. అల్లంతో మరికొన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.

పరగడుపున అల్లం వాటర్​ తాగితే - ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!

కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది :చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా అల్లం సహాయపడుతుందంటున్నారు నిపుణులు. పచ్చి అల్లం లేదా అల్లం నీరు, అల్లం టీ తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్​ను కరిగించుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు.

క్యాన్సర్‌కు విరుగుడు :అల్లంక్యాన్సర్‌కు విరుగుడుగా కూడా పనిచేస్తుందట. జింజర్​లో కొలొరెక్టర్, లివర్ క్యాన్సర్లపై పోరాడే గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి డైలీ డైట్​లో అల్లం చేర్చుకోవడం వల్ల వివిధ క్యాన్సర్ల ముప్పు నుంచి బయటపడవచ్చంటున్నారు.

జీర్ణ సమస్యలకు చెక్ : అజీర్ణం, కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, వికారం బాధపడేవారు అల్లం తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు. పాలు లేకుండా అల్లం టీ లేదా బ్లాక్ టీ తాగడం వల్లన కొద్ది నిమిషాల్లోనే కడుపునొప్పి తగ్గుతుందని సూచిస్తున్నారు. అలాగే అల్లం ఒత్తిడి, ఆందోళన వంటి భావనలను దూరం చేసి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆరోగ్యానికి మంచిదని 'అల్లం' ఎక్కువగా తీసుకుంటున్నారా? - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details