Health Benefits of Fenugreek Seeds: అందరి వంట గదిలో కనిపించే వస్తువుల్లో మెంతులు ఒకటి. వంటకాలకు మంచి రుచి తెచ్చే ఈ మెంతులు.. ఆరోగ్యానికీ, అందానికీ ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. మెంతుల్లో పొటాషియం, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, డైటరీ ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, రైబోఫ్లావిన్ వంటి ముఖ్యమైన పోషకాలతో ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే మెంతులను మన ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
షుగర్ కంట్రోల్:మధుమేహుల్లో గ్లూకోజు మోతాదులు తగ్గడానికి మెంతులు ఉపయోగపడుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి(ICMR) నివేదిక పేర్కొంటోంది. మెంతులు రక్తంలోని చక్కెర స్థాయులు నియంత్రించడంలో సహాయపడతాయి. శరీరం పిండి పదార్థాలను గ్రహించుకోవటాన్ని నెమ్మదింపజేసి.. రక్తంలో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తాయి. దీనివల్ల గ్లూకోజ్ కంట్రోల్‌లో ఉంటుంది. మెంతుల్లో 4-హైడ్రాక్సిస్‌ల్యూసిన్ అనే అమైనో ఆల్కనాయిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంతో పాటు కణాలు ఇన్సులిన్‌ను తీసుకునేలా చేస్తుంది.
జీర్ణ సమస్యలకు చెక్: ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మెంతులు మేలు చేస్తాయి. మెంతులను ఆహారంలో భాగం చేసుకుంటే ఈ సమస్యలు దూరమవుతాయ. మెంతులు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. ఎసిడిటీని దూరం చేస్తాయి. మెంతులు తింటే.. మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.
దంతాల్లో రక్తమా? గుండెకు ముప్పు! - ఈ అలవాట్లు ఫాలో కావాల్సిందే!
కొలెస్ట్రాల్ నియంత్రణ:మెంతులు.. కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా అదుపులో ఉంచుతాయి. మెంతికూరలోని ఫ్లేవనాయిడ్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక బరువుతో బాధపడేవారు ఉదయాన్నే నానబెట్టిన మెంతి గింజలను గోరువెచ్చని నీటితో పరగడుపున తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.