తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 10:10 AM IST

ETV Bharat / health

ఇంట్రస్టింగ్ ​: కింద కూర్చుని భోజనం చేస్తే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Benefits Of Eating Sitting On Floor

Benefits Of Eating Sitting On Floor : ప్రస్తుత కాలంలో చాలా మంది ఇళ్లలోకి డైనింగ్‌ టేబుల్స్ వచ్చేశాయి. అవి లేనివారు కుర్చీల మీద కూర్చుని భోజనం చేస్తుంటారు. కొంతమంది మాత్రమే కింద కూర్చుని భోజనం చేస్తుంటారు. మరి.. నేలపైన కూర్చుని భోజనం చేయడం వల్ల మీ శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా?

Eating Sitting On Floor
Benefits Of Eating Sitting On Floor (ETV Bharat)

Health Benefits Of Eating Sitting On Floor :ఒకప్పుడు ఇంట్లో అందరూ కలిసి ఒకేచోట కబుర్లు చెప్పుకుంటూ కింద కూర్చుని భోజనం చేసేవారు. కానీ, ప్రస్తుత కాలంలో డైనింగ్‌ టేబుల్స్‌, కూర్చీలు, సోఫాలు వచ్చిన తర్వాత ఎక్కువ మంది జనాలు కింద కూర్చుని తినడం లేదు. ఎవరికి ఆకలేసినప్పుడు వారు ప్లేట్స్ పట్టుకొని, టీవీ చూస్తూ తింటున్నారు. అయితే.. నేలపైన కూర్చుని భోజనం చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో మీకు తెలిస్తే.. మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవి ఏంటంటే..

నేలపైన కూర్చుని తినడం కూడా ఒక విధంగా ఆసనం వేసినట్టే అవుతుందట! కాళ్లు మడిచి నేలపై కూర్చోవడాన్ని 'సుఖాసనం' అంటారు. ఇలా తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

జీర్ణక్రియకు ఎంతో మేలు :
కింద కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అది ఎలా అంటే.. మనం కింద కూర్చున్నప్పుడు వెన్నెముక స్థిరంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ అవయవాలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్‌ వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. 2016లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో ఇరాన్‌లోని "టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్సెస్" డిపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్‌ 'డాక్టర్ షాహిన్ ఘరావీ' పాల్గొన్నారు.

బరువు తగ్గొచ్చు :
డైనింగ్‌ టేబుల్‌ మీద కూర్చుని తినడం వల్ల.. ఎంత తింటున్నామో తెలియకుండానే ఎక్కువగా తినే అవకాశం ఉంటుందట. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కింద కూర్చుని భోజనం చేయడం వల్ల పొట్ట నిండినట్లుగా బ్రెయిన్‌కు సంకేతాలు అంది తక్కువ తినే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల తక్కువ ఆహారం తింటామట.

రక్తప్రసరణ బాగా జరుగుతుంది :
నేలపైన కూర్చుని భోజనం చేయడం వల్ల కాళ్లకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది. దీనివల్ల కాళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటివి తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడి తగ్గుతుంది :
నేలపై కూర్చుని తినడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయట. ధ్యానం, యోగా వంటివి చేసినప్పుడు పొందే మానసిక ప్రశాంతతను ఈ సుఖసనం ద్వారా పొందవచ్చు. ఒత్తిడి ఎలా తగ్గుతుందంటే.. మనం కింద కూర్చున్నప్పుడు వెన్నెముక నిటారుగా ఉండి, లోతుగా శ్వాసను పీలుస్తాము. దీనివల్ల స్ట్రెస్‌ తగ్గుతుందట.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చూడండి :

ఊహాతీతం : ఒక సిగరెట్​ తాగడం పూర్తయ్యేలోపు - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వెయిట్ తగ్గాలంటే బరువులే ఎత్తాల్సిన అవసరం లేదు - ఈ నీళ్లు తాగినా సరిపోతుందట!

అలర్ట్ : మీకు ఈ అలవాట్లు ఉన్నాయా? - అయితే, మీ బ్రెయిన్​కు ముప్పు పొంచి ఉన్నట్టే!

డయాబెటిస్ రోగులు ట్యాబ్లెట్స్​ అవతల విసిరికొట్టొచ్చు! - ఈ హెర్బల్‌ డ్రింక్స్‌ తాగితే చాలు!

ABOUT THE AUTHOR

...view details