తెలంగాణ

telangana

ETV Bharat / health

పెరుగే కదా అని అనుకోవద్దు- బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు! - Health Benefits of Curd - HEALTH BENEFITS OF CURD

Health Benefits of Curd : ప్రపంచం మొత్తంలో పరిచయం అక్కరలేని ఆహారపదార్థాల్లో పెరుగు ఒకటి. ముఖ్యంగా మన తెలుగు వాళ్లకు భోజనం చివర్లో ముద్ద పెరుగన్నమైనా తినందే తృప్తిగా తిన్న ఫీలింగే రాదు. రుచితో పాటు ఎన్నో లాభాలున్నాయి. కాబట్టే మన పూర్వీకులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చారు.

Health Benefits of Curd
Health Benefits of Curd (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Aug 14, 2024, 5:01 PM IST

Health Benefits of Curd : పాలకు సరైన బ్యాక్టీరియా యాడ్ చేయడం వల్ల కమ్మటి పెరుగు తయారవుతుంది. కాస్త పుల్లగా అనిపించినా ఇది అనేక రకాల పోషకాలతో కూడి ఉంటుంది. పెరుగు నేరుగా మాత్రమే కాకుండా పలు రకాలైన వంటకాలతో కూడా ఎంజాయ్ చేస్తారు. డైరీ ఉత్పత్తుల్లో ఒకటైన పెరుగును రోజు తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. ఆహారం చివర్లో కొద్దిగైనా పెరుగును జోడించడం వల్ల చర్మారోగ్యంతో పాటుగా, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుంది.

అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవల్ తగ్గి బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది. ఫలితంగా శరీరంలో రోగ నిరోధకవ్యవస్థ బలపడుతుంది. కొన్నిఅధ్యయనాల ప్రకారం హైపర్ టెన్షన్ లాంటి సమస్యలు ఉన్న వారు నేచురల్ రెమెడీగా పెరుగును వాడతారట. పెరుగును సరైన మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గి, చక్కటి ఫిట్‌నెస్ సాధిస్తారు. పోషక విలువలు కారణంగానే ఆహార పదార్థాల్లో పెరుగుకు ఇంత ప్రాధాన్యం. ఒక వంద గ్రాముల పెరుగులో 98 కేలరీలు, 3.4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 4.3 గ్రాముల కొవ్వు, 11 గ్రాముల ప్రొటీన్, 364 మిల్లీగ్రాముల సోడియం, 104 మిల్లీగ్రాముల పొటాషియంలతో పాటు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ బీ-12లు ఉంటాయి.

పెరుగు తినడం వల్ల ప్రయోజనాలు:
బరువు తగ్గడానికి!
బరువు తగ్గాలనుకునేవారు పెరుగును తమ డైట్​లో చేర్చుకోవడం చాలా బెటర్. దీంట్లో శరీర బరువును నియంత్రణలో ఉంచడానికి సరిపడే మోతాదులో కాల్షియం ఉండటమే కాకుండా ఒబెసిటీ రాకుండా చేస్తుంది. కాల్షియం కార్టిసాల్ ఏర్పడడాన్ని అడ్డుకుని బరువు పెరగకుండా చేస్తుంది. ఈ బెనిఫిట్ పొందాలంటే తరచుగా 18 ఔన్సుల పెరుగు తింటే సరిపోతుంది.

ఎముకల బలానికి!
పెరుగులో ఉండే కాల్షియం, పాస్పరస్‌లు ఎముకల బలానికి ఉపయోగపడతాయి. పళ్లు, ఎముకల బలంగా ఉండేందుకు కచ్చితంగా అవసరమైన కాల్షియం పెరుగు నుంచి దొరుకుతుంది. రెగ్యులర్​గా పెరుగును తీసుకోవడం వల్ల ఎముకల లంగా తయారై ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి.

గుండె ఆరోగ్యానికి!
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ధమనులను శుభ్రం చేసి రక్త సరఫరా సాఫీగా అయ్యేందుకు సహకరిస్తుంది. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

రోగ నిరోధక వ్యవస్థ కోసం!
మానవ శరీరానికి కచ్చితంగా అవసరమైన బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో ఒకటి పెరుగు. శరీరానికి సరిపడా శక్తి, సామర్థ్యాన్ని పెంచి మెటబాలిజాన్ని మెరుగు చేస్తుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తి) పెరుగుతుంది.

కాంతివంతమైన చర్మం కోసం!
చర్మ సంరక్షణకు పెరుగు బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి పోషకాలను అందించి కాంతి వంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ, జింక్ చర్మాన్ని సహజంగానే కాపాడుతాయి.

కేశారోగ్యం కోసం!
డల్ హెయిర్, డ్రై హెయిర్, డాండ్రఫ్‌తో కూడిన హెయిర్ ఉన్న వాళ్లకు పెరుగు మంచి మందు. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లకు న్యూట్రియంట్లు, మినరల్స్ అందించి డాండ్రఫ్‌ను అరికడుతుంది. పెరుగు హెయిర్ కండీషనర్​గా కూడా ఉపయోగపడుతుంది. హెన్నాతో కలిపి తలకు పెట్టుకోవడం వల్ల జుట్లు రాలడం తగ్గుతుంది.

సరైన PH లెవల్ కోసం!
యోని ఆరోగ్యానికి దోహదపడే పీహెచ్ స్థాయి స్థిరత్వం పెరుగు వల్లనే కలుగుతుంది. రోజూ పెరుగును తీసుకోవడం వల్ల ఆడవాళ్లలో యోని ఆరోగ్యంగా ఉంటుందట. యోని సమస్యలకు ప్రభావవంతమైన ఫలితాలు రాబట్టడానికి పెరుగు కచ్చితంగా తీసుకోవడం బెటర్. మగవారిలోనూ సెక్స్ డ్రైవ్ మెరుగయ్యేందుకు పెరుగు దోహదపడుతుందట.

ఒత్తిడి నియంత్రణ, మానసిక ఆరోగ్యం!
కొన్ని రీసెర్చ్ ఫలితాల ఆధారంగా పెరుగు ప్రశాంతతో పాటు ఎమోషనల్ కానివ్వకుండా మెదడును సిద్ధం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి యాంగ్జైటీ రాకుండా చేస్తుంది. బ్రెయిన్ హెల్త్ కోసం ఇది నేచురల్ రెమెడీ కూడా.

ఇన్ఫెక్షన్స్‌కు దూరంగా!
చాలా వరకు కూడా నోటి ద్వారా వ్యాపించే జబ్బులు బ్యాక్టీరియా వల్లనే కలుగుతాయి. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా ఇతర బ్యాక్టీరియాలను శరీరంలోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది.

జీర్ణక్రియ సక్రమంగా!
మలబద్దకం, డయేరియా, ఉబ్బరం లాంటివి లేకుండా చేసేందుకు పెరుగు కీలకం. జీర్ణక్రియ వేగవంతం చేసి ఆహారంలోని పోషకాలను శరీరానికి వేగవంతంగా అందేలా చేస్తుంది పెరుగు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఆరోగ్యమైన ఫుడ్ అంటే ఏంటి! ఏ టైంలో ఎంత మోతాదులో తీసుకోవాలి? - Healthy Eating

గుడ్​ స్లీప్,​ ఫుల్​ ఖుషీ! ఏ టైంలో స్నానం చేస్తే సుఖంగా నిద్రపోవచ్చో తెలుసా? - Showering Before Bed

ABOUT THE AUTHOR

...view details