Health Benefits of Bhindi In Summer : సమ్మర్‌లో బెండకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది :
వేసవి కాలంలో ఎండవేడి, ఉక్కపోత కారణంగా చెమట ద్వారా శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. అయితే.. బెండకాయ తినడం వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. బెండీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. అలాగే ఇందులో మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ఎలక్ట్రోలైట్ స్థాయిలను పెంచుతాయని అంటున్నారు. ఇంకా బెండకాయను తినడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటుందని పేర్కొన్నారు.
పోషకాలు పుష్కలం :
సన్నగా కనిపించే బెండకాయలో.. విటమిన్ సి, కె, ఫోలెట్, యాంటీఆక్సిడెంట్ వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి సమ్మర్‌లో మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే.. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉండేలాచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తాయని అంటున్నారు.
పరగడుపున వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది? - మీకు తెలుసా? - Eating Raw Garlic Side Effects
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తరచూగా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు సమ్మర్‌లో బెండకాయ తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, సమ్మర్‌లో వీటిని తప్పకుండా అందరూ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బరువు అదుపులో :
బెండకాయలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి అతిగా తినకుండా చేస్తుందని నిపుణులంటున్నారు. అందుకే.. వెయిట్ లాస్ కోరుకునేవాళ్లు వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
షుగర్ అదుపులో :
మధుమేహం వ్యాధితో బాధపడేవారు బెండకాయను తరచూగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు 12 వారాలపాటు రోజుకు 100 గ్రాముల బెండకాయలను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని 'షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయం'లో పని చేసే 'ఎమ్. దేహ్ఘాని (M. Dehghani)' పాల్గొన్నారు. షుగర్ ఉన్నవారు బెండకాయను రోజూ తినడం వల్ల వారి శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా బెండకాయలో ఉండే ఫైబర్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయం చేస్తుందని నిపుణులంటున్నారు.
- NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ నెయిల్స్ తరచూ విరుగుతున్నాయా? - ఇలా చేశారంటే ఆ ప్రాబ్లమ్ రాదు! - Nails Breakage Prevent Tips
అలర్ట్ : మీ ఒంట్లో ఈ లక్షణాలు ఉన్నాయా? - అయితే ఉప్పు ఎక్కువగా తింటున్నారు! - Excessive Salt Consumption Signs