Health Benefits of Bathing with Salt Water: ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడంతోపాటు శారీరక శుభ్రత కూడా ముఖ్యం. అందుకోసం ఉదయం, సాయంత్రం స్నానం చేయడం తప్పనిసరి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది. ఉదయం నుంచి పడిన టెన్షన్స్ నుంచి రిలీఫ్ లభిస్తోంది. అయితే మామూలు నీటితో స్నానం చేయడం కన్నా ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం..
చర్మం ఆరోగ్యంగా:ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు నీటిలోని పోషకాలు.. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తాయని అంటున్నారు. ఉప్పులో ఉండే మినరల్స్ చర్మంపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి అనేక ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయని సూచిస్తున్నారు. అలాగే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను తగ్గించడానికి, చర్మంపై దురద తగ్గడానికి ఉప్పు నీటి స్నానం ఉపయోగపడుతుందని అంటున్నారు.
మొటిమలకు చెక్: మొటిమలను వదిలించుకోవడానికి ఉప్పు నీటి స్నానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయని.. ఆ తర్వాత శరీరంలోని మురికి సులభంగా బయటకు వస్తుందని అంటున్నారు. తద్వారా ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయని... దీనితోపాటు, ఈ నీరు చర్మాన్ని హైడ్రేట్ చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. ఉప్పు నీటితో రెగ్యులర్‌గా స్నానం చేయడం వల‌్ల ముఖంపై ముడతలు కూడా తగ్గుతాయని.. దీంతోపాటు చర్మం మరింత మృదువుగా అందంగా మారి యవ్వనంగా కనిపిస్తారని అంటున్నారు.
దెబ్బతిన్న కిడ్నీలను కూడా బాగుచేయొచ్చట - వైద్యుల సంచలన పరిశోధన!
కీళ్ల నొప్పుల నుంచి రిలీఫ్:ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల వాపు, నొప్పులు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే కీళ్ల వద్ద రక్త ప్రసరణను మెరుగుపడుతుందని అంటున్నారు. అలాగే కీళ్లకు సంబంధించిన వాతం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉప్పు నీటి స్నానం వల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా తగ్గించుకోవచ్చంటున్నారు.
వెన్ను నొప్పి పరార్:గోరు వెచ్చటి నీటిలో సాల్ట్ వేసుకుని స్నానం చేయడం వల్ల కండరాలు సడలింపు లభిస్తుందని.. వెన్నుముకపై ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఉప్పు.. నీటిలో ఉండటం వల్ల గురుత్వాకర్షణ శక్తి తగ్గి, ఫలితంగా కీళ్లు, వెన్నుముకపై ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
ఈ సమస్య కూడా తగ్గుతుంది:ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఫైబ్రోమైయాల్జియా సమస్య కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఫైబ్రోమైయాల్జియా అంటే.. పని ఒత్తిడి, అతిగా కూర్చోవడం, అనారోగ్య ఆహారపు అలవాట్లు వంటి కారణంగా కండరాలు, కీళ్లు, శరీరంలోని వివిధ భాగాల్లో తీవ్ర నొప్పులు వస్తుంటాయి. దీంతోపాటు చాలా మందిలో అలసట, బద్ధకం, నిద్రలేమి కూడా వస్తూ ఉంటుందని అంటున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.