తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇంట్రస్టింగ్​: మీకు "బుల్లెట్​ప్రూఫ్​ కాఫీ" గురించి తెలుసా? - ఇది తాగితే మీ శరీరంలో జరిగే మార్పులివే! - Benefits of Bulletproof Coffee - BENEFITS OF BULLETPROOF COFFEE

Benefits Of Ghee Coffee: కాఫీ.. ఈ పేరు వింటేనే చాలా మందికి తాగకముందే రిలీఫ్​ అనిపిస్తుంది. ఇక కాఫీలో అంటే చాలానే రకాలు ఉన్నాయి. ఫిల్టర్‌ కాఫీ, బ్లాక్‌ కాఫీ అంటూ ఎవరికి నచ్చినవి వారు తాగుతుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది బుల్లెట్​ప్రూఫ్​ కాఫీ తాగుతున్నారు. పేరు కొంచెం డిఫరెంట్​గా ఉన్నా ఈ ట్రెండ్​ను చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఈ కాఫీ ఏంటిది? ఇది తాగితే శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Ghee Coffee
Health Benefits of Bulletproof Coffee (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 11, 2024, 3:41 PM IST

Health Benefits of Bulletproof Coffee :బుల్లెట్​ప్రూఫ్​ కాఫీ.. ప్రస్తుతం చాలా మంది ఫాలో అవుతున్న ట్రెండ్​.ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు కూడా దీనిని తాగుతున్నట్లు చెబుతున్నారు. బుల్లెట్​ప్రూఫ్​ కాఫీ గురించి సింపిల్​గా చెప్పాలంటే కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడమే. అలా అని రెగ్యులర్​గా తాగే కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం కాదు. మరి దీనిని ఎలా ప్రిపేర్​ చేయాలి? ఈ కాఫీ తాగితే శరీరంలో జరిగే మార్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం..

బుల్లెట్​ ఫ్రూప్​ కాఫీ తాగితే కలిగే ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి పెరుగుతుంది :కాఫీలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్‌లు ఎ, ఇ వంటి వాటితో పాటు, ఖనిజాలు అందుతాయని నిపుణులు అంటున్నారు. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయని.. అలాగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించి ఆరోగ్యంగా ఉండేలా తోడ్పడతాయంటున్నారు.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది :నెయ్యిలో బ్యూట్రిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణక్రియలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోయి జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. 2021లో "Nutrition and Metabolism" జర్నల్​లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నెయ్యి కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లౌబరో విశ్వవిద్యాలయంకి చెందిన డాక్టర్‌ మైఖేల్ గ్లీసన్ పాల్గొన్నారు.

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా?

మెదడు చురుకుగా పనిచేస్తుంది :నెయ్యిలోని సంతృప్త కొవ్వులు మెదడు ఆరోగ్యంగా, చురుకుగా పనిచేయడానికి ఎంతో సహాయపడతాయి. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందట.

శక్తిని అందిస్తుంది :నెయ్యిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ (MCTs) ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌, స్టామినా పెరుగుతుంది.

బరువు అదుపులో :నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. కాఫీలో నెయ్యి కలుపుకుని మితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

నెల రోజుల పాటు కాఫీ, టీ తాగకపోతే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

గుండె ఆరోగ్యంగా :నెయ్యిలోని హెల్దీ ఫ్యాట్స్ శరీరంలో మంటను, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాఫీలో నెయ్యి కలిపి తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయంటున్నారు.

మెరిసే చర్మం :నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా మెరుస్తూ ఉండేలా చేస్తాయి. డైలీ బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నెయ్యి కలిపిన కాఫీ తాగడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయట. అలాగే ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

  • చివరిగా నెయ్యి కలిపిన కాఫీ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నా కూడా.. మీరు ఈ కాఫీని డైట్​లో తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిదంటున్నారు.

బుల్లెట్​ప్రూఫ్​ కాఫీ ప్రిపరేషన్​:

కావాల్సిన పదార్థాలు:

  • వాటర్​ - 1 గ్లాసు
  • కాఫీ పొడి - 1 టీ స్పూన్​
  • నెయ్యి - 1 టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా స్టౌ ఆన్​ చేసుకుని గిన్నె పెట్టుకుని వాటర్​ వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత వేరే గ్లాస్​ తీసుకుని అందులో కాఫీ పౌడర్​, నెయ్యి వేసుకుని.. కలుపుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి హాట్​ వాటర్​ పోసుకుని.. హ్యాండ్​ బ్లెండర్​ సాయంతో 30 సెకన్ల పాటు బ్లెండ్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత కప్పులోకి పోసుకుని తాగడమే.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగుతున్నారా ? అయితే మీరు డేంజర్​లో ఉన్నట్టే!

కాఫీ బంద్ చేయలేకపోతున్నారా? - బదులుగా ఇవి తాగండి!

ABOUT THE AUTHOR

...view details