Fruits For Weight Loss : ఆరోగ్యం చెక్కు చెదరకుండా, చర్మం మెరుస్తూ కనిపించేలా చేయడమే కాక, బరువు తగ్గడానికి కూడా సహాయపడే ఆహార పదార్థం ఏది అంటే ఈజీగా చెప్పే సమాధానం పండ్లు. వీటిలో శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోజుకు కనీసం ఒక పండైనా తినడం లేదంటే మీరు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారని అర్థం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలు, వాకింగ్, డైటింగ్ వంటి వాటితో పాటు కొన్ని రకాల పండ్లను డైట్లో చేర్చకోవడం వల్ల త్వరగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారు తినాల్సినవి, తక్కువ చక్కెర, తక్కువ కేలరీలు కలిగిన పండ్లు కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు
స్ట్రాబెర్రీలు కేవలం రుచికరమైన పండ్లు మాత్రమే కాదు, ఇందులో కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది సహాయపడే పండ్లు. ఇందులో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలోనూ ఈ పండు సహాయపడుతుంది.
కివి
కివీ పండ్లలోనూ చక్కెర శాతంతో పాటు కేలరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే, మీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పండు కివీ. జీవక్రియ పనితీరు మెరుగ్గా ఉండేందుకు కివి చాలా బాగా సహాయపడుతుంది.
నారింజ
నారింజలో ఉండే ఫైబర్ బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది. దీంట్లోని విటమిన్-సీ మీరు ఎక్కువ కాలం పాటు సంతృప్తిగా ఉండేలా చేస్తాయి. ఆకలి కోరికలను నివారించడానికి నారింజ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది మీ చర్మాన్ని మెరిసేలా కాంతివంతంగా తయారు చేస్తుంది.
ద్రాక్షపండు
ద్రాక్ష పండ్లలో విటమిన్-సీ, ఫైబర్‌తో పాటు ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మీకు కడుపుకు ఎక్కువ సేపు తృప్తిగా అనిపిస్తుంది. ఇందులో చక్కెర స్థాయిలు, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కనుక వీటిని ప్రతిరోజూ తినడం వల్ల సులభంగా బరువు తగ్గడంతో పాటు జీవక్రియ మెరుగవుతుంది.