ETV Bharat / health

"థైరాయిడ్" విజృంభణ - ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్​ కావాలంటున్న నిపుణులు!

-నేటి కాలంలో మహిళలను అధికంగా వేధిస్తున్న థైరాయిడ్​ -వ్యాధి ప్రధాన లక్షణాలు ఇవే!

Thyroid Symptoms
Thyroid Symptoms (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : 7 hours ago

Thyroid Symptoms : ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం వంటి వివిధ కారణాల వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా మహిళలను థైరాయిడ్‌ సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. ఈ ఒక్క సమస్య వల్ల మహిళల్లో పలు రకాల ఇబ్బందులు వస్తాయని ప్రముఖ డయాబెటాలజిస్ట్​ 'డాక్టర్​ పి.వి. రావు' చెబుతున్నారు. థైరాయిడ్​ వల్ల వచ్చే హెల్త్​ ప్రాబ్లమ్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మన బాడీలో ఎన్నో అవయవాలు, విభాగాలుంటాయి. వీటిలో థైరాయిడ్​ వ్యవస్థ అత్యంత కీలకంగా పని చేస్తుంది. మన జీవక్రియల్ని క్రమబద్ధం చేసే.. అతి ముఖ్యమైన పనిని థైరాయిడ్ వ్యవస్థే నిర్వహిస్తుంది. సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్​ గ్రంథి.. శరీర అవసరాలను బట్టి, నిరంతరం హార్మోన్లను స్రవిస్తూ జీవక్రియల్ని సక్రమంగా జరిగేలా చూస్తుంది. అయితే, థైరాయిడ్​ గ్రంథి విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్​ ఎక్కువైనా, తక్కువైనా కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

థైరాయిడ్​ ద్వారా వచ్చే ఇబ్బందులను రెండు రకాలుగా విభజించవచ్చంటున్నారు నిపుణులు. అవసరమైన దాని కంటే.. థైరాయిడ్​ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంటే.. అలాంటి పరిస్థితిని హైపర్​ థైరాయిడిజమని (Hyperthyroidism), నార్మల్​ స్థాయి కంటే తక్కువగా థైరాయిడ్​ హార్మోన్​ ఉన్నప్పుడు హైపో థైరాయిడిజమని (Hypothyroidism) అంటారని డాక్టర్​ వివరిస్తున్నారు.

హైపో థైరాయిడ్​ లక్షణాలు :

  • సాధారణంగా థైరాయిడ్​తో బాధపడేవారిలో తీవ్రమైన అలసట వేధిస్తుంది.
  • థైరాయిడ్​ హార్మోన్స్​ తగ్గితే బరువు​ పెరుగుతారు.
  • జుట్టు అధికంగా రాలిపోతుంది.
  • ఎక్కువగా చెమట పడుతుంది.
  • థైరాయిడ్​తో బాధపడేవారిలో బయటకు కనిపించే లక్షణాలలో మెడ ఉబ్బడం ఒకటి. థైరాయిడ్​ గ్రంథి మార్పుల వల్ల ఇలా మెడ వాపు వస్తుంది.
  • థైరాయిడ్​ సమస్య తలెత్తినప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. ఒక్కసారిగా పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. వాతావరణం సరిగానే ఉన్నా.. ఎక్కువ చలిగానో లేదా ఎక్కువ వేడిగానో అనిపిస్తుంది.
  • స్కిన్ పొడిబారుతుంది.
  • గోర్లు కూడా పెలుసుగా మారతాయి.
  • తరచూ కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయి.
  • చేతులు జలదరింపులు వస్తాయి.
  • మలబద్ధకం
  • అసాధారణ రుతుస్రావం

హైపర్​ థైరాయిడ్​ లక్షణాలు :

  • శరీరంలో థైరాయిడ్​ హార్మోన్స్ పెరిగితే.. ఒక్కసారిగా శరీర బరువు తగ్గుతుంది.
  • కండరాలు బలహీనంగా మారతాయి. చేతులు వనుకుతాయి.
  • కంటి సమస్యలు
  • విరేచనాల బాధ
  • మహిళల్లో థైరాయిడ్​ వ్యాధి.. రుతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల క్రమరహిత రుతుచక్రం ఇబ్బంది పెడుతుంది.
  • హైపోథైరాయిడ్​ కారణంగా ఫ్యాట్స్​ అధికంగా పెరిగి హార్ట్​స్ట్రోక్​ వచ్చే ప్రమాదం ఉంటుందట.
  • కొన్ని సందర్భాల్లో తక్కువ హార్మోన్ల కారణంగా స్పృహ తప్పే అవకాశం ఉంటుంది.
  • హైపర్​ థైరాయిడ్​ సమస్యతో బాధపడేవారు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే హార్ట్​ ప్రాబ్లమ్స్​ వస్తాయి. అందుకే ఈ సమస్య ఉన్నవారు డాక్టర్లను కలిసి.. వారు సూచించిన మందులను రోజూ వాడుకోవాలని డాక్టర్​ పి.వి రావు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

పిల్లల్లో థైరాయిడ్​-గుర్తించకపోతే పెను శాపం

చలికాలంలో ఏసీ వాడుతున్నారా? ఆస్థమా, ఇన్​ఫెక్షన్లతో జాగ్రత్త! ఈ చిట్కాలు పాటిస్తే సరి!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.