Foods TO Increase Children Height : పిల్లలు ఎత్తు పెరిగేందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచూ అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి ద్వారా పిల్లలు త్వరగా హైట్ పెరుగుతారని అంటున్నారు. పిల్లలు ఎదిగేందుకు దోహదపడే ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పాలు, పాల ఉత్పత్తులు :పాలు, కొన్ని రకాల పాల ఉత్పత్తులలో విటమిన్ డి ఉంటుంది. ఇది పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఎదిగేలా ఎంతో సహాయం చేస్తుంది. అలాగే వీటిలో ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్ బి2 (రిబోఫ్లావిన్), విటమిన్ బి12 వంటి ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇవన్నీ పిల్లల హైట్ పెరిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
సోయా బీన్స్ :సోయా బీన్స్‌లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, కండరాల పెరుగుదలకు చాలా అవసరం. అలాగే సోయా బీన్స్‌లో ఉండే అమైనో ఆమ్లాలు కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. ఇంకా సోయా బీన్స్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకలు, దంతాలు దృఢంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. అందుకే పిల్లలకు తరచూ సోయా బీన్స్‌తో చేసిన ఆహార పదార్థాలను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కోడి గుడ్లు : పిల్లలు క్రమం తప్పకుండా ఎగ్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. ఎత్తు కూడా పెరుగుతారు. ఎగ్స్‌లో ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలుంటాయి. ఇవన్నీ ఎదిగేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. 2000లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్'లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గుడ్డులోని ప్రొటీన్, కాల్షియం, విటమిన్ బి12, రిబోఫ్లావిన్‌తో సహా పిల్లలకు అవసరమైన అనేక పోషకాలు ఇందులో ఉన్నాయని.. ఈ పోషకాల వల్ల రోజుకు ఒక గుడ్డు తినే పిల్లలు తినని వారి కంటే.. ఎక్కువ ఎత్తు పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూట్రిషన్ అండ్ చైల్డ్ హెల్త్ ఎక్సపర్ట్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టిన్ ప్రొఫెసర్ 'డాక్టర్ మార్గరెట్ డి. లియోనార్డ్' పాల్గొన్నారు.
మీ పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరిగారా? ఈ చార్ట్‌తో చెక్ చేసుకోండి!
చికెన్ :పిల్లలు ఎత్తు పెరిగేందుకు చికెన్ మంచి ఆహారం. ఇందులో ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషకాలుంటాయి. ఇవి పిల్లలు వయసుకు తగినట్లు ఎత్తు పెరిగేందుకు సహాయం చేస్తాయి.