Fennel Seeds for Control Blood Sugar : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా సమస్త మానవాళిని పీడిస్తున్న అతిపెద్ద సమస్య.. డయాబెటిస్! దాంతో అన్నీ తినాల్సిన సమయంలోనూ కొన్ని కఠినమైన ఆహార నియమాలు ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్థులు షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవడానికి డైలీ ఎన్నో మందులు వాడుతుంటారు. అయితే, అలాకాకుండా మీరు రోజు సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే డయాబెటిస్‌ను ఈజీగా కంట్రోల్ ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. అంతేకాదు.. సోంపును(Anise Seeds) తీసుకోవడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. ఇంతకీ, సోంపుతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? షుగర్ నియంత్రణం కోసం ఏ విధంగా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఇబ్బందిపడేవారికి సోంపు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు.. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. ఇవి బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతాయని చెబుతున్నారు. అదే విధంగా సోంపులో పుష్కలంగా ఉండే ఫైబర్ కూడా రక్తంలో చక్కెర, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. కాబట్టి దీనిని డైలీ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
అలాగే.. ఈ గింజలలో ఉండే ఫైబర్, కాల్షియం, పోటాషియం, ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే, షుగర్ పేషెంట్స్ అనేక విధాలుగా సోంపును తమ డైలీ డైట్లో చేర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సోంపును నమిలి తినడం : డయాబెటిస్ ఉన్న వారు డైలీ భోజనం తర్వాత సోంపును నమిలి తినడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇలా తినడం జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పడుకునే ముందు సోంపు గింజలను తిన్నా అది షుగర్‌ను అదుపులో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా.. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు సోంపును నమలడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.