Dos And Donts Of Food Poisoning : వీకెండ్ వస్తే సరదాగా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లడం, ఇంట్లో భోజనంపై ఆసక్తి తగ్గి హోటల్ భోజనం వైపు మళ్లడం లాంటివి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. కారణం ఏదైనా ఇంట్లో వండిన రుచి, శుచి కలిగిన ఆహారాలను కాదని చాలామంది బయట ఆహారాలకు అలవాటు పడుతున్నారు. అయితే బయట వండే ఆహారాలు కొన్నిసార్లు అనేక కారణాల వల్ల కలుషితం అవుతుంటాయి. శుభ్రంగా లేకపోవడం, నీరు కలుషితం అవ్వడం, వండే ఆహారాలు సరిగ్గా లేకపోవడం లాంటి కారణాల వల్ల ఫుడ్ పాయిజన్‌కు గురికావచ్చు.
ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఇవే
హోటల్ లేదా దాబా లేదా మరేదైనా బయటి ప్రదేశాల్లో వండిన ఆహారాలు కలుషితం అయినప్పుడు అవి తిన్న వారికి వాంతులు, విరేచనాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు. వీటితో పాటు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, అజీర్తి, కడుపులో ఇబ్బంది, పొట్టలో నొప్పి లాంటి లక్షణాలు ఉండవచ్చు. కొంతమందికి కళ్లు తిరగడం లాంటివి కూడా జరగవచ్చు. చాలా వరకు వాంతులు ఆగకుండా వస్తాయి. ఒళ్లంతా నీరసంగా అనిపిస్తుంది.
ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఏం చెయ్యాలంటే
అనుకోకుండా తీసుకున్న ఆహారం ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు వీలైనన్ని జ్యూస్‌లు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నిమ్మరసం కానీ పుదీనా రసం తీసుకోవడం వల్ల చాలా వరకు ఫుడ్ పాయిజన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. తురుమిన అల్లం, కాస్త జీలకర్రను మజ్జిగలో కలిపి తీసుకోవడం మంచిది. ఇది కూడా మీ శరీరానికి మేలు కలుగజేస్తుంది. అలాగే దానిమ్మ గింజలకు పొట్టలో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని తెలిసిన వెంటనే తినవచ్చు.