Is Overnight Phone Charging Bad : కొంతమంది తమ ఫోన్లకు రాత్రి ఛార్జింగ్ పెట్టి, నిద్రపోతుంటారు. ఇలా చేస్తే ఉదయంకల్లా తమ ఫోన్ బ్యాటరీ 100 శాతం ఫుల్ అయి ఉంటుందని భావిస్తుంటారు. వాస్తవానికి ఇలా అతిగా, గంటల తరబడి ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి వదిలేయడం మంచిది కాదు. దీనివల్ల ప్రయోజనం జరగకపోగా, ఫోన్‌లోని బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. గంటల తరబడి ఛార్జింగ్ మోడ్‌లో ఉండటం వల్ల ఫోన్ బ్యాటరీ బాగా వేడెక్కుతుంది. దీనివల్ల ఫోన్ భద్రత ప్రమాదంలో పడుతుంది. మీ ఫోన్‌ను నిత్యం 80 శాతానికిపైగా ఛార్జ్ చేస్తున్నా ఛార్జింగ్ పదేపదే 20 శాతానికి దిగువకు పడిపోతున్నా మీ బ్యాటరీ వేగంగా బలహీనపడుతుందని గుర్తుంచుకోవాలి.
సాధారణంగానైతే 50 శాతం ఛార్జింగ్ మోడ్‌లో మీ ఫోను చాలా బాగా పనిచేస్తుంటుంది. ఛార్జింగ్ ఫోన్‌ను తలగడ కింద పెట్టి కొంతమంది ఛార్జింగ్ అవుతున్న ఫోన్‌ను తమ తలగడ కింద పెట్టుకొని నిద్రపోతుంటారు. ఇలా చేయడం చాలా డేంజర్. ఎందుకంటే తలగడ కింద గాలి ప్రవాహం సరిపడా ఉండదు. దీనివల్ల బ్యాటరీ, ఫోన్, ఛార్జర్, కేబుల్ వేగంగా వేడెక్కుతాయి. దీనివల్ల మీరు పెద్ద ముప్పును కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఇలాంటప్పుడు మీరు థర్డ్ పార్టీ ఛార్జర్లను వినియోగిస్తే, ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరిగిపోతాయి. ఆ ఛార్జర్లు అంతగా సురక్షితమైనవి కాదు.
ఈ ఉష్ణోగ్రతల్లో ఫోన్ ఉంచొద్దు
మీ ఫోన్‌ను 0 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద, 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచొద్దు. ఒకవేళ ఆ టెంపరేచర్‌ను మీ ఫోన్ ఎదుర్కొంటే దానిలోని లిథియం అయాన్ బ్యాటరీ వేగంగా డౌన్ అయిపోతుంది. మీ కారు లేదా ఇతరత్రా వాహనంలో ఫోన్‌ను ఆరుబయట వాతావరణంలో వదిలేయకండి. సూర్యరశ్మి కోసం మీరు ఆరుబయట నిలబడినప్పుడు చేతిలో ఫోన్ లేకుండా జాగ్రత్తపడండి.
బ్యాటరీ 100 శాతానికి మించితే, అతిగా వాడినట్టేమీ ఫోన్‌లోని బ్యాటరీ లెవల్ 100 శాతాన్ని చూపిస్తున్న ఛార్జింగ్‌ను ఇంకా కొనసాగించడం వల్ల ప్రయోజనమేం ఉండదు. ఎందుకంటే 100 శాతానికి మించిన పవర్‌ను బ్యాటరీ నిల్వ చేసుకోలేదు. దాని సామర్థ్యం అంతేనని మనం అర్థం చేసుకోవాలి. బ్యాటరీ ఫుల్ అయ్యాక కూడా ఛార్జింగ్‌ను కొనసాగిస్తే మీరు మీ ఫోన్‌లోని బ్యాటరీని అతిగా వాడేస్తున్నట్లు అర్థం. దీనివల్ల ఆ బ్యాటరీలో దాగిన శక్తి త్వరగా దహించుకుపోతోంది. ఫలితంగా దాని జీవితకాలం తగ్గిపోతుంది.
ఛార్జ్ సైకిల్స్ తెలుసుకోండి
స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో లిథియం ఆయాన్ పాలిమర్ అనే రకానికి చెందిన లిథియం అయాన్ బ్యాటరీలను వినియోగిస్తుంటారు. ఇవి చిన్న సైజులో ఉన్నా వేగంగా ఛార్జ్ అవుతాయి. సురక్షితమైనవి కూడా. బ్యాటరీకి కొన్ని ఛార్జ్ సైకిల్స్ ఉంటాయి. 0 శాతం నుంచి 100 శాతం దాకా ఒక ఛార్జింగ్ సైకిల్. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి, దాని జీవిత కాలంలో నిర్దిష్ట సంఖ్యలో ఛార్జ్ సైకిల్స్‌ను కలిగి ఉంటుంది. ఆ ఛార్జ్ సైకిల్స్ ముగిసిన తర్వాత, విద్యుత్‌ను ఎక్కువ సేపు నిల్వ చేసుకోలేక అది వేగంగా డౌన్ అవుతుంటుంది. అతిగా ఛార్జింగ్ పెడితే ఇలాంటి పరిస్థితి త్వరగా వస్తుంది. సగటున 20 శాతం నుంచి 80 శాతం రేంజ్లో ఫోన్ ఛార్జింగ్ లెవల్స్‌ను ఉంటుకుంటే, మీ ఫోన్ బ్యాటరీ కనీసం 1000కిపైగా ఛార్జ్ సైకిల్స్‌ను అందిస్తుంది. ఇది మూడేళ్ల పాటు రోజూ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టిన దానితో సమానం. బ్యాటరీ త్వరగా డౌన్ కావొద్దంటే ఈ టిప్స్ పాటించండి.
- బ్యాటరీ త్వరగా డౌన్ కావొద్దంటే, మీ ఫోన్ స్క్రీన్ టైంను, బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోండి. చాలా స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ సేవర్ ఆప్షన్ ఉంటుంది. అవసరమైనప్పుడు దాన్ని వినియోగించాలి.
- బ్లూటూత్, వైఫైలకు కనెక్ట్ అయినంత మాత్రాన ఫోన్ బ్యాటరీ త్వరగా డౌన్ కాదు. అయితేే కొన్ని ఫోన్లలో జీపీఎస్, మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువ సేపు వస్తుంటుంది.
- ఛార్జింగ్ జరుగుతుండగా మీరు మీ ఫోన్‌లో పెద్దపెద్ద యాప్స్‌ను ఏకకాలంలో వినియోగించకూడదు. యూట్యూబ్ వీడియోలను చూడకూడదు. గేమ్స్‌ను ఆడకూడదు. దీనివల్ల అది త్వరగా వేడెక్కి, బ్యాటరీ ఛార్జింగ్ వేగం తగ్గిపోతుంది. మీ ఫోన్ పనితీరు కూడా నెమ్మదిస్తుంది.