Pumpkin Face Mask DIY :చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అదే సమయంలో మార్కెట్లో దొరికే కెమికల్ కాంబినేషన్ క్రీంలు వాడితే చర్మం ఏమవుతుందో అనే భయం కూడా ఉంటుంది. అలాంటి వారి కోసమే సహజ సిద్ధంగా వేసుకునే మాస్క్‌ను మీ ముందుకు తీసుకొచ్చాం. నిత్యం అందుబాటులో ఉండే గుమ్మడికాయ తినడానికే కాదు మీ అందాన్ని రెట్టింపు చేసేందుకు ముఖానికి మాస్క్‌గా కూడా ఉపయోగపడుతుందట. ఇమ్యూనిటీ పెంచే విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సీ, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, సెలీనియం, ఐరన్, మెగ్నీషియం, బీటా కెరోటిన్ ఉండే గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం.
ఇది చర్మానికి ఎందుకు మంచిదంటే?
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే గుమ్మడికాయ మాస్క్ చర్మంపై ముడతలు, గీతలు తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా మృదువైన, కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్-ఏను అందించి డ్యామేజ్ అయిన చర్మంపై కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా పిగ్మంటేషన్ సమస్యను కూడా దూరం చేస్తుంది. దాంతో పాటుగా ఇందులో ఉండే జింక్ సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. గుమ్మడికాయలో ఉండే సహజమైన ఎంజైములు చర్మానికి తగు వనరులు అందించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని, జుట్టుని అందిస్తుంది. మరి దాని తయారీ విధానమేంటో తెలుసా?