Healthy Eating :శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బ్యాలెన్స్‌డ్ డైట్ తప్పనిసరి. పండ్లు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం. ప్రోసెస్‌డ్ ఫుడ్స్, షుగర్స్, అనారోగ్యకరమైన కొవ్వులను నియంత్రించుకోవడం వంటివి చేస్తుండాలి.
ఇవి సరైన రీతిలో తీసుకుంటేనే ఆరోగ్య వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. మంచి బరువు, రిస్కులు లేని జీవనం మన సొంతమవుతుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, ఒబెసిటీ లాంటివి దరి చేరవు. ఇవన్నీ సాధ్యపడేందుకు ఆరోగ్యంగా తినడమెలాగో కొన్ని పద్దతుల ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
ఏం తినాలో ముందుగానే నిర్ణయించుకోవాలి
మనం తినే ఆహారంపై మనకు అవగాహన ఉండాలి. ఏం తినాలో అనేది ముందుగా ప్లానింగ్ చేసుకోండి. ఏరోజు ఏం తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది తెలుసుకోవాలి. మన రోజువారి డైట్లో ఆ ఆహారాన్నిసిద్ధం చేసుకోవాలి.
లెక్కపెట్టుకుని తినండి
తినే టప్పుడు చిన్న ప్లేట్స్, బౌల్స్, గిన్నెల్లాంటి పాత్రలు ఉపయోగించి మీరు తీసుకునే ఆహారాన్ని అదుపులో పెట్టుకోండి. ఆకలి వేస్తుందని ఎక్కువగా తినకూడదు. చిన్న గిన్నెలలో తినడం అలవాటు చేసుకుంటే ఎక్కువగా తినే సమస్య నుంచి బయటపడతారు.
ఎక్కువగా తీసుకోవాల్సినవి
పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. షుగర్, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ప్రోసెస్‌డ్ ఫుడ్‌ను పక్కన పెట్టేయండి. పోషకాలైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.