Cycling vs Running For Fitness : ఫిట్‌గా ఉండాలనుకునే వారు తప్పకుండా చేసే పని వ్యాయామం. రన్నింగ్ లేదా సైక్లింగ్ అందులో బెటర్ ఆప్షన్‌గా చాలా మంది భావిస్తారు. ఈ రెండూ క్రమం తప్పకుండా చేసేవారికి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, శరీరం ఫిట్‌గా ఉండాలంటే సైక్లింగ్ లేదా రన్నింగ్ ఇందులో ఏది చేస్తే మంచిది? రెండూ మంచివే అయినప్పటికీ దేని వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయి? ఇలాంటి అనేక సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.
కేలరీలు
హార్వర్డ్ చేసిన పరిశోధనల ప్రకారం 70కేజీల బరువు ఉన్న వ్యక్తి 30 నిమిషాల పాటు గంటకు 5 మీటర్ల వేగంతో పరిగెత్తితే 288 కేలరీలు తగ్గించుకోవచ్చు. అదే వ్యక్తి సైక్లింగ్ చేస్తూ అవే కేలరీలు బర్న్ చేయడానికి అరగంటలో 19.3 నుంచి 22.3 మీటర్ల వేగంతో సైక్లింగ్ చేయాల్సి ఉంటుందట. వేగం పెంచిన కొద్దీ ఇంకాస్త ఎక్కువ కేలరీలు తగ్గించవచ్చు. ఇలా బరువు తగ్గాలనుకునేవారు రన్నింగ్, సైక్లింగ్ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంచుకుని ప్రయత్నిస్తుంటారు. కానీ, సైక్లింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తోనే ఎక్కువ కేలరీలు ఖర్చుచేయగలరని వైద్యులు అంటున్నారు.
కండరాలు సామర్థ్యం
రన్నింగ్, సైక్లింగ్ అనేవి రెండు రకాలుగా పనిచేస్తుంటాయి. ఒకటి మన కదలికల సహాయంతో కండరాలను విదిలిస్తూ చేసేది, రెండోది కండరాల సాయంతో ఒత్తిడిని తట్టుకుంటూ ముందుకు కదిలేది. పరిగెత్తడం వల్ల కండరాల సామర్థ్యం మెరుగవుతుంది. ప్రత్యేకించి క్వాడ్రిసెప్స్‌లో ఈ మార్పు కనిపిస్తుంది. కానీ, మీరు అదే పనిగా ఎక్కువ కాలం పరిగెత్తితే మీ కండరాలు దెబ్బతినే ప్రమాదముంది. అదే సైక్లింగ్ విషయానికొస్తే సుదూరాలకు రన్నింగ్ చేసే దాని కంటే సైకిల్ తొక్కడం వల్ల కండరాల సామర్థ్యం పెరుగుతుంది. కానీ, అది మెరుగవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది.
ఎంత సమయం పడుతుంది
ముందుగా అనుకున్నట్లు సైక్లింగ్, రన్నింగ్ల మధ్య వ్యత్యాసం ఎక్కువే. మామూలుగా మనం రన్నింగ్ చేయాలనుకుంటే, శరీరం ఆరోగ్యంగా ఉండి ఒక రన్నింగ్ షూస్ జత ఉంటే సరిపోతుంది. అదే సైకిలింగ్ చేయాలనుకుంటే సైక్లింగ్ ట్రాక్ ఉండాలి. దానికి సంబంధించిన షార్ట్స్, సైకిల్, హెల్మెట్, సైక్లింగ్ షూస్ ఇలా చాలా సమకూర్చుకోవాల్సి ఉంటుంది.