Amazing health Benefits of crystal salt: ఉప్పు ఆహారానికి రుచిని అందించడం మాత్రమే కాదు.. మన శరీరానికి అయోడిన్ అందిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరుని నియంత్రించడం, శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడంలో అయోడిన్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. సోడియం అధికంగా తీసుకుంటే.. హైబీపీ, కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఏ ఉప్పు వాడుతున్నామనేది ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
కళ్లు (సముద్రపు ఉప్పు) ఉప్పును ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయని.. వీటి వల్ల పలు ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు.
మెరుగైన జీర్ణక్రియ :కళ్లు ఉప్పు తీసుకుంటే.. ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కళ్లు ఉప్పు.. జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుందని.. ఇది ఆహారం విచ్ఛిన్నతకు, శోషణకు సాయపడుతుందని అంటున్నారు. అలాగే.. మలబద్ధకం, కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరానికి చల్లదనం, శక్తిని ఇవ్వడంలోనూ సాయపడుతుందని చెబుతున్నారు.
2020లో "జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. కళ్లు ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, అలాగే మలబద్ధకం సమస్యను కూడా తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలోని గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో పనిచేస్తున్న డా.A.K. సింగ్ పాల్గొన్నారు.
రోగనిరోధక శక్తి :కళ్లు ఉప్పులో యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో, అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.