Corn Flour For Face Benefits :మన ఆహార పదార్థాలకు మంచి క్రిస్పీ రుచిని అందించి, చిక్కటి పరిమాణం కోసం ఉపయోగించే పదార్థం కార్న్ ఫ్టోర్(మొక్కజొన్న పిండి). ఇది కేవలం వంటకాల్లో మాత్రమే కాదు చర్మ సంరక్షణ విషయంలోనూ మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? ప్రొటీన్లు, స్టార్చ్, ఆరోగ్యకరమైన ఫ్యాట్ కలిగి ఉండే మొక్కజొన్న పిండి చర్మానికి సహజమైన అందానిస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. కార్న్ ఫ్లోర్ ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి మృతకణాలు తొలగిపోతాయట.
కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి)లలో విటమిన్లు, మినరల్లతో పాటు చర్మానికి అవసరమైన కెమికల్ కాంపౌండ్స్ చాలా ఉంటాయి. చర్మసంరక్షణకు ముఖ్యమైన విటమిన్-ఏ, విటమిన్-బీ, ఫొలేట్, మెగ్నీషియం, పొటాషియంతో పాటు రకరకాల ప్రొటీన్లు, కొవ్వులు వంటివి మెండుగా ఉంటాయి. ఇన్ని పోషక విలువలు కలిగి ఉన్న మొక్క జొన్న పిండిని ముఖానికి రాసుకోవడం వల్ల జరిగే అద్భుతాలేంటంటే?
- కార్న్ ఫ్లోర్లో ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్-ఏ ఆరోగ్యకరమైన చర్మం కోసం ఉపయోగపడుతుంది. అధ్యయనాల ప్రకారం దీంట్లోని విటమిన్-ఏ చర్మ కణాల పనితీరును మెరుగుపరిచి చర్మాన్ని మరింత కాంతివంతంగా, తాజాగా మారుస్తుంది
- కాపర్, జింక్ వంటివి పోషకాలుండటం వల్ల మొక్క జొన్న పిండిని ముఖానికి రాసుకుంటే చర్మ స్థితిస్తాపకత మెరుగై గీతలు, ముడతలు వంటివి రాకుండా ఉంటాయి.
- చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసే ప్రొటీన్లు, చర్మపు రంధ్రాలను తొలగించేందుకు మొక్క జొన్న పిండి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చర్మాన్ని ఆరోగ్యకరంగా మార్చుతుంది.
- మొటిమలు, మచ్చలతో బాధపడుతున్న వారికి కార్న్ ఫ్లోర్ చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్-ఈ మొటిమల సమస్య నుంచి చర్మాన్ని దూరంగా ఉంచడంతో పాటు చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
- మొక్క జొన్న పిండితో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల సోలార్ రేడియేషన్, యూవీ కిరణాల నుంచి కలిగే హాని నుంచి తప్పించుకోవచ్చు. నిర్జీవంగా, పొడిగా ఉండే చర్మం ఉన్నవారు దీన్ని క్రమం తప్పకుండా వాడితే అద్భుతమైన ఫలితాలు కపిస్తాయి.
- అలసిపోయి డల్‌గా మారినప్పుడు ముఖానికి మొక్కజొన్న పిండి రాసుకోవడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కాంతివంతంగా మెరుస్తూ కనిపిస్తుంది. దీంట్లోని విటమిన్-ఏ, పోషకాలు చర్మ రక్షణకు సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తి మెరుగుపరుస్తాయి.