తెలంగాణ

telangana

ETV Bharat / health

కాఫీ తాగితే బరువు పెరుగుతారా? నిపుణులు ఏమంటున్నారంటే! - Coffee Side Effects

Coffee Side Effects : చాలా మంది ఉదయం లేవగానే బ్రష్ చేసుకుని ఒక కప్పుడు కాఫీ తాగేస్తారు. కొందరైతే గంటకోసారి ఈ పానీయాన్ని తాగేస్తుంటారు. అయితే కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని, దాని వల్ల బరువు పెరుగుతుంటారని చాలా సార్లు వింటుంటాం. అందులో నిజమెంత? కాఫీ తాగితే నిజంగా బరువు పెరుగుతారా? కాఫీలో ఏముంటుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

Coffee Side Effects
Coffee Side Effects (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 16, 2024, 6:31 AM IST

Coffee Side Effects: ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే అసలు రోజుకు గడవదు కొందరికి. కాఫీ తాగిన తర్వాతే రోజు మొదలుపెడతారు. అంతలా ఈ కాఫీకి కనెక్ట్ అయిపోతారు. అయితే కాఫీ తాగడం వల్ల బరువు పెరుగుతారని దశాబ్దాలుగా ఓ ప్రశ్న ఉంది. ఈ క్రమంలో కాఫీ తాగితే బరువు పెరుగుతారా? రోజుకు ఎన్నిసార్లు కాఫీ తాగొచ్చు? కాఫీ తాగడం వల్ల లాభాలున్నాయా? తదితర ప్రశ్నలకు ఈ స్టోరీలో సమాధానం తెలుసుకుందాం.

కాఫీ అనేది ఒక ప్రముఖ పానీయం. దానిలో కెఫిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే కాఫీ తాగగానే రిఫ్రెష్​గా అనిపిస్తుంటుంది. ఒత్తిడి సమయంలో దీన్ని తాగి ఉపశమనంగా భావిస్తుంటారు. కాఫీలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. అధిక మొత్తంలో తక్షణ శక్తిని కూడా అందిస్తుంది. కాఫీని రోజుకు కొద్దిగా తాగడం వల్ల బరువు తగ్గొచ్చు. అయినా ఇతర ఆహారాల మాదిరిగానే కాఫీని అధికంగా తాగితే కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి.

నిద్రలేమి సమస్య
పడుకునే ముందు కాఫీ తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. అలాగే జీవక్రియపై ప్రభావం చూపుతుంది. బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ మెదడులోని అడెనోసిన్ గ్రాహకాల నియంత్రణలను ప్రభావితం చేస్తుంది. ఉపశమనం, శక్తి కోసం పగటిపూట ఒక కప్పు కాఫీ తాగొచ్చు. అంతేగానీ రాత్రి వేళ కాఫీని తాగకపోవడం ఉత్తమం. లేదంటే మీకు నాణ్యమైన నిద్ర పట్టదు. నిద్రలేమి వల్ల ఒత్తిడి, ఇతర మానసిక ఆరోగ్య సమస్యల బారినపడతారు. అలాగే రాత్రి పూట నిద్రపట్టకపోవడం వల్ల మేల్కొని ఉంటే మీరు ఏదైనా తినొచ్చు. దీంతో బరువు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాగా, నిద్రవేళకు కనీసం 6 గంటల ముందు నుంచే కాఫీ లేదా ఇతర కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోకుండా ఉండాలని బయో మెడికల్ సైంటిస్ట్, న్యూట్రిషనిస్ట్ బెల్లా కార్వోస్సో తెలిపారు. అధికంగా కెఫిన్ తీసుకుంటే నాణ్యమైన నిద్ర పట్టదని హెచ్చరించారు.

ఒత్తిడి పెరగొచ్చు
కొంతమంది కాఫీని ఎక్కువగా తాగుతారు. అప్పుడు కాఫీలో ఉండే కెఫిన్ వారిలో ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల కార్టిసాల్ హార్మోన్ల విడుదలవుతాయి. దీంతో ఆకలి పెరిగి ఎక్కువ తినేస్తుంటారు. అప్పుడు శరీరంలో కొవ్వు పెరిగిపోయి బరువు పెరిగే అవకాశం ఉంది.

చక్కెర స్థాయిల్లో మార్పులు
కాఫీని ఎక్కువ సార్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగిపోతాయి. అలాగే జీవక్రియ రేటు కూడా తగ్గుతుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు తక్కువ మొత్తంలో కాఫీని తాగాలని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 3-4 కప్పుల కాఫీ (సుమారు 400 మిల్లీగ్రాములు) అంటే కెఫిన్ ఉన్న పానీయాన్ని తాగినా ఫర్వాలేదని తెలిపారు.

ఇలా చేస్తే కేలరీలు పెరగడం పక్కా!
కాఫీ చేసేందుకు అధిక చక్కెర, సువాసనగల సిరప్‌లు, క్రీమ్స్, అధిక కొవ్వు పాలను వాడితే కేలరీలు పెరిగిపోతాయి. వీటిలో ఉండే అనారోగ్యమైన కొవ్వులు శరీర బరువును పెంచుతాయి. యునైటెడ్ స్టేట్స్ డైటరీ గైడ్‌ లైన్స్, ఇతర ఆరోగ్య సంస్థలు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫిన్ ఉన్న పానీయాలు తాగవచ్చని తెలిపాయి. అలాగే కాఫీని అధికంగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. అయితే మితంగా తాగడం వల్ల బరువు తగ్గొచ్చు .

రోజుకు ఎంత కాఫీ తాగొచ్చు?

తక్కువ కేలరీలు
కాఫీని చక్కెరలు, క్రీమ్ వంటివి లేకుండా చేస్తే అందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఒక కప్పు బ్లాక్ కాఫీలో కేవలం 2 కేలరీలు మాత్రమే ఉంటాయి. ప్రతిరోజు ఒక కప్పు బ్లాక్ కాఫీని తాగితే మీ బరువులో ఎటువంటి మార్పు ఉండదు.

జీవక్రియను పెంచుకోవచ్చు
కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది తాత్కాలికంగా జీవక్రియ రేటును పెంచుతుంది. జీవక్రియ రేటు పెరగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది
కాఫీలోని కెఫిన్ కంటెంట్ కొంతమందికి ఆకలిని తగ్గిస్తుంది. కాఫీని రోజుకు కొద్ది మొత్తంలో తాగితే ఎటువంటి ఆరోగ్యమైనపరమైన ఇబ్బంది ఉండదు. బరువు కూడా పెరగరు. అధిక మొత్తంలో అంటే కప్పుల కొద్ది కాఫీని తాగడం వల్ల బరువు పెరుగుతారనే విషయం గుర్తుంచుకోవాలి.

ముఖ్య గమనిక :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్లకు గుడ్​న్యూస్- ఈ కొత్త మందుతో నెలల వ్యవధిలో డయాబెటిస్​ కంట్రోల్! ఇక ఇంజక్షన్​తో పనిలేదు! - insulin production research

ప్రతి ఉదయం నిమ్మరసం తాగితే అనారోగ్యం దరిచేరదు! లెమన్​ వాటర్​ ఫుల్​ బెనిఫిట్స్​ ఇవే! - Lemon Water Health Benefits

ABOUT THE AUTHOR

...view details