How to Reduce Cholesterol without Medication:మన శరీరంలో LDL(చెడు కొలెస్ట్రాల్), HDL(మంచి కొలెస్ట్రాల్) అనే రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. అందులో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్రమాదం. చెడు కొలెస్ట్రాల్ వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి హార్ట్ ఎటాక్, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరైతే తినే ఫుడ్‌ని తగ్గిస్తుంటారు. అలాకాకుండా ఆరోగ్యకరంగా మీరు కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయులను తగ్గించుకోవచ్చని తెలుసా? అందుకోసం మీరు చేయాల్సిందల్లా నిపుణులు సూచించినట్లు.. మీ ఆహారం, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడమే! ఇంతకీ.. ఆ మార్పులేెంటో స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలో రక్తంలో ప్రవహించే కొలెస్ట్రాల్‌లో 20% మాత్రమే మనం తీసుకునే ఆహారం నుంచి వస్తుందని ఎక్కువ మందికి తెలియదు. అంటే.. కాలేయం, పేగులు మిగిలిన కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తాయన్నమాట. అయితే.. మనం తీసుకునే ఆహారంలో చాలా వరకు కొలెస్ట్రాల్.. మాంసం, పాలు వంటి జంతు సంబంధిత ఆహారాల నుంచి బాడీలో చేరుతుంది. అందుకు ప్రధాన కారణం.. వాటిలో ఉండే శాచురేటెడ్ కొవ్వులే అని చెప్పుకోవచ్చు. ఇవే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయంటున్నారు నిపుణులు.
అందుకే.. మీరు మొదటగా చేయాల్సిన పని డైలీ డైట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ తగ్గించేలా చూసుకోవాలి. వాటికి బదులుగా అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే వాటిని మీ డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు. అంటే.. కొన్ని రకాల కూరగాయ నూనెలు, అవకాడోలు, కొవ్వు చేపలు వంటివి తీసుకోవాలి. అదేవిధంగా ఫైబర్ పుష్కలంగా ఉండే మొక్కల ఆహారాలు అంటే.. కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, ఓట్స్ వంటివి డైలీ డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు. అలాగే.. చీజ్‌బర్గర్‌లు, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
అలర్ట్ ఎవ్రీవన్ : మారిపోయిన కొలెస్ట్రాల్ లెక్కలు - తొలిసారి CSI మార్గదర్శకాలు - అంతకు మించితే అంతే!
మీ డైట్లో ఇవి చేర్చుకోండి :ఇప్పుడు చెప్పబోయే మూడు డైటరీ సప్లిమెంట్స్ LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. పలు పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. అవేంటంటే..