ETV Bharat / health

కళ్ల కింద క్యారీ బ్యాగులు వచ్చాయా? ఇలా చేస్తే ఈజీగా పోతాయట! - CARRY BAGS UNDER EYES TREATMENT

-నిద్రలేమి, అలర్జీలు, ఉప్పు పదార్థాలే కారణమట! -ఇంట్లోని వస్తువులతో ఇలా చేస్తే అంతా సెట్!

How to Reduce Eye Carry Bags
How to Reduce Eye Carry Bags (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 14 hours ago

How to Reduce Eye Carry Bags: మనలో చాలా మందికి కళ్ల కింద ఉబ్బుగా కనిపిస్తుంటుంది. దీన్ని క్యారీ బ్యాగులని అంటుంటారు. ఇందుకు నిద్రలేమి, అలర్జీలు, ఉప్పు పదార్థాలు, పొగ తాగటం వంటివెన్నో కారణం అవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అక్కడ ద్రవాలు పోగవడం వల్ల ఇవి తలెత్తుతుంటాయని వివరిస్తున్నారు. అయితే, వీటిని తగ్గించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, కేవలం కొన్ని చిట్కాలతో వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. అవేంటో ఇప్పుడే తెలుసుకుందాం.

  • కళ్ల కింద క్యారీ బ్యాగ్స్ తగ్గించడంలో దోసకాయ ముక్కలు బాగా సాయపడతాయని నిపుణులు అంటున్నారు. 2013లో Journal of Cosmetics, Dermatological Sciences and Applicationsలో ప్రచురితమైన "Skin Cooling and Anti-Inflammatory Effects of Cucumber (Cucumis sativus) Slices"లోనూ ఈ విషయం తేలింది. దోసకాయ ముక్కలను సన్నగా కోసి.. వాటిని 10-12 నిమిషాలపాటు కళ్లపై ఉంచాలని చెబుతున్నారు. ఫలితంగా కళ్ల కింద వాపు తగ్గి క్యారీ బ్యాగ్స్ తగ్గిపోతాయని వివరిస్తున్నారు.
  • ఇంకా చల్లదనంతో అదమటం వల్ల తేలికగా క్యారీ బ్యాగులు పోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం శుభ్రమైన రుమాలును చల్లటి నీటిలో తడిపి, గట్టిగా పిండాలట. ఆ తర్వాత దాన్ని కళ్ల మీద పెట్టుకొని, కొద్ది నిమిషాల సేపు నెమ్మదిగా అదమాలని వివరిస్తున్నారు. అయితే దీన్ని కూర్చున్నప్పుడే చేయాలని.. పడుకొని చేయొద్దని పేర్కొన్నారు. మరింత చల్లగా ఉండాలంటే రుమాలును ఫ్రిజ్‌లో లేదా డీప్‌ ఫ్రీజర్‌లో పెట్టి అదమొచ్చని సలహా ఇస్తున్నారు.
  • ముఖ్యంగా ఎక్కువగా నీరు తాగటం వల్ల కూడా కొన్నిసార్లు పరిష్కారం చూపొచ్చని వివరిస్తున్నారు. శరీరంలో నీటిశాతం తగ్గినప్పుడు శరీరంలోని కణాలు, కణజాలాలు తమ అవసరాల కోసం నీటిని సంగ్రహించి, పట్టి ఉంచటానికి ప్రయత్నిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఉబ్బు తలెత్తొచ్చని వివరిస్తున్నారు. అందుకే నీళ్లు తాగితే కణాలు నిల్వ చేసుకున్న నీటిని వదిలేస్తాయని పేర్కొన్నారు.
  • టీ బ్యాగులను కాసేపు గోరువెచ్చటి నీటిలో ఉంచి, పూర్తిగా చల్లబడ్డాక కళ్ల మీద పెట్టుకోవటమూ ఈ సమస్యకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలోని కెఫీన్‌.. రక్తనాళాలు సంకోచించేలా చేసి, ఉబ్బు తగ్గటానికి తోడ్పడుతుందని అంటున్నారు.
  • ఇంకా ఉప్పులోని సోడియం రక్తనాళాల్లోకి నీటిని లాక్కొని, పెద్దగా అయ్యేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం ద్వారా కూడా కళ్ల కింద క్యారీబ్యాగులను తగ్గించుకోవచ్చని వివరిస్తున్నారు.
  • కొన్ని రకాల అలర్జీల వల్ల కూడా కళ్ల కింద ఉబ్బు తలెత్తొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలర్జీతో బాధపడేవారు అందుకు గల కారణాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

శరీరం పంపే హెచ్చరికలను గుర్తించారా? ఈ రోగాలు వస్తాయని బాడీ ముందే చెప్పేస్తుందట! అవేంటో తెలుసా?

రోజుకు ఎంత చక్కెర తినాలి? షుగర్ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమేనట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.