Cashew Side Effects : డ్రైఫ్రూట్స్ అన్నింటిలో చాలా మంది ఇష్టంగా తినేవి జీడిపప్పు. అమోఘమైన రుచి కలిగిన జీడిపప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయంటారు కనుక చాలా మంది వీటిని ఎక్కువ తినేస్తారు. నేరుగా మాత్రమే కాకుండా రకరకాల స్నాక్స్, స్వీట్ ఐటమ్స్లోనూ వీటిని ఉపయోగిస్తుంటారు.
నిజానికి ప్రొటీన్లు, రాగి, మాంగనీస్, జింక్, మెగ్నీషియం లాంటివి అధికంగా ఉండే జీడిపప్పులు మంచి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయి. అలాగని వీటిని ఎంత మొత్తంలో అయినా తినొచ్చా? జీడిపప్పులను ఎక్కువగా తింటే ఏం అవుతుంది? అనే విషయాలను తెలుసుకుందాం.
అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమే!
మార్కెట్లో జీడిపప్పులు రకరకాల స్నాక్స్ రూపంలో లభిస్తాయి. అలా దొరికే సాల్డెడ్ జీడిపప్పును అధికంగా తినడం వల్ల మీ శరీరంలో సోడియం పెరుగుతుంది. ఇది మీ రక్తపోటును పెంచుతుంది. వాస్తవానికి ఉప్పు లేని జీడిపప్పుల్లోనే 3.4 మిల్లీ గ్రామల సోడియం ఉంటుందట. అలాంటిది వీటిని మరింత సాల్ట్ జతచేసి తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమేనట.
బరువు పెరిగిపోతారు!
జీడిపప్పులను అతిగా తినడం వల్ల కలిగే మరో సమస్య ఏంటంటే బరువు పెరగడం. ఇవి మంచి కొవ్వులను కలిగి ఉన్నప్పటికీ.. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. 18 జీడిపప్పుల్లో దాదాపు 160 నుంచి 200 కేలరీల వరకూ ఉంటాయట. కాబట్టి వీటిని తినడం వల్ల శరీర బరువు సులువుగా పెరుగుతుంది. కనుక బరువు తగ్గాలనుకునే వారు వీటికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.