తెలంగాణ

telangana

ETV Bharat / health

గర్భనిరోధక మాత్రలు వాడితే బరువు పెరుగుతారా? వైద్యులు ఏం చెబుతున్నారు? - contraceptive pill myths

Can Contraceptive Pills Cause Heavy Weight Gain : అవాంఛిత గర్భాన్ని నివారించేందుకు ప్రస్తుతం వివిధ గర్భనిరోధక మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వాడే విషయంలో సమాజంలో చాలా మందిలో అపోహలు ఉన్నాయి. మార్కెట్లో పిల్స్​గా వ్యవహరించే గర్భ నిరోధక మాత్రలు వేసుకుంటే బరువు పెరుగుతారని, క్యాన్సర్ వస్తుందని రకరకాల సందేహాలు ఉన్నాయి. అలాంటి వాటిపై డాక్టర్లు ఏమంటున్నారో ఓ సారి తెలుసుకుందామా?

birth control pills myths
Myths and Realities on Contraceptive Methods

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 8:02 AM IST

Updated : Feb 24, 2024, 8:09 AM IST

Can Contraceptive Pills Cause Heavy Weight Gain :పెళ్లైన కొత్తలో గర్భం వద్దనుకునేవారు, పిల్లలను కనడాన్ని కొంతకాలం వాయిదా వేయాలనుకుని భావించేవారు గర్భనిరోధక మందులు లేదా సాధనాలు వాడుతుంటారు. ఇందులో నోటి మాత్రలతోపాటు, కాపర్-టి పద్ధతులు అనుసరిస్తుంటారు. అయితే ఇలా గర్భనిరోధక మాత్రలు వేసుకునేవారు బరువు పెరుగుతుండటం ప్రధానంగా కనిపిస్తోంది. ఇలా బరువు పెరగడానికి గర్భనిరోధక మాత్రలు ఒక్కటే కారణమా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయనేదానిపై అవగాహన లేక చాలామంది అనవసరంగా ఆందోళన చెందుతుంటారు. ఈ భయాల్లో నిజమెంత అన్న విషయంపై వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

  1. గర్భనిరోధక మాత్రల వల్ల బరువు పెరుగుతారా?
    గర్భనిరోధక మాత్రలు వాడితే బరువు పెరుగుతారని చాలా మంది అపోహ పడుతుంటారు. ఇలాంటి మాత్రలు వాడేవారిలో కొంతమంది తొలుత కొద్ది వారాలు బరువు పెరగడాన్ని మనం చూస్తుంటాం. దీనికి కారణం గర్భనిరోధక మాత్రల ద్వారా హార్మోన్లు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. శరీరంలోకి నీరు చేరుతుంది. దీనివల్ల ప్రొజెస్టరాన్ ఇరిటేషన్ వల్ల తాత్కాలికంగా బరువు పెరుగుతారు.
  2. హర్మోన్ మాత్రలతో సంతాన సాఫల్యత దెబ్బతింటుందా?
    పిల్స్, కండోమ్స్ ఇతర గర్భనిరోధక సాధనాలు వాడినంతవరకు గర్భం రాదు. గర్భం ధరించాలనుకున్నప్పుడు పిల్స్ వాడటం మానేసిన కొద్ది రోజుల తర్వాత అండం ఉత్పత్తి అవుతుంది. అయితే ఇంజక్షన్లు తీసుకుంటే అండం విడుదల కొన్ని నెలలు ఆలస్యం అవుతుంది. పీరియడ్స్ సరిగా అవ్వకపోవడం వల్లే గర్భం ఆలస్యం అవుతుంది.
  3. కాపర్​-టితో నెలసరి సమస్యలు పెరుగుతాయా?
    బ్లీడింగ్ సమస్యలు లేనివారికి మాత్రమే కాపర్-టి పెడుతుంటారు. హెవీ బ్లీడింగ్ ఉంటే దానికి తగ్గ మాత్రలు అందిస్తారు. కాపర్-టి పెట్టించుకున్నట్లయితే నెలసరి వచ్చినప్పుడు డాక్టర్​ను సంప్రదించాలి.
  4. నోటి మాత్రలు ఎక్కువగా వాడకూడదా?
    పిల్స్ వాడటం వల్ల కొంతమందిలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ కాలం గర్భనిరోధక మాత్రలు వాడరాదు. రెండేళ్లలోపే ఈ మాత్రలు వాడటం ఆపేయాలి. అంతేకాకుండా కాళ్ల పిక్కల్లో నొప్పులు వచ్చినా, నీరు చేరినట్లు అనిపించినా, విపరీతమైన తలనొప్పి వస్తున్నా, రక్తనాళంలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్​ను సంప్రదించాలి.
  5. నోటిమాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా?
    బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎందుకు ఉందంటే, మాత్రల వల్ల సింథటిక్ ఈస్ట్రోజాన్, ప్రొజెస్ట్రిరాన్ అనేది శరీరంలోకి వెళ్లడం వల్ల ఈ హర్మోన్లు ఎక్కువగా ప్రభావితమై క్యాన్సర్ ముప్పును తెస్తుంది.
  6. బిడ్డకు పాలిస్తున్న కాలంలో గర్భం వచ్చే అవకాశం లేదా?
    పాలిచ్చే తల్లుల్లో బ్రెయిన్ నుంచి పొలాక్టిన్ అనే హర్మోన్ ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల పీరియడ్స్ రాకుండా ఆగుతాయి. ఇలా కేవలం రెండు నెలలు మాత్రమే జరుగుతుంది. కానీ, కొంతమంది దీనిపై అవగాహన లేకుండా ఉండటం వల్ల నాలుగైదు నెలలు వరకు పిల్లలకు పాలివ్వడం వల్లే గర్భం నెలసరి రావడం లేదని భావిస్తారు.
  7. గర్భనిరోధక మాత్రలతో సుఖ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందా?
    సాధారణంగా కండోమ్స్ వల్ల మాత్రమే సుఖవ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఆడవాళ్లు అనుసరించే పద్ధతుల వల్ల సుఖ వ్యాధులను నివారించలేం. కేవలం మగవాళ్లు మాత్రమే సుఖ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి గర్భ నిరోధక మాత్రల వల్ల బరువు పెరిగే అవకాశం లేకపోయినా, క్యాన్సర్ ముప్పు ఎక్కువనేది గ్రహించాలి. మరీ ఎక్కువ కాలం గర్భ నిరోధక సాధనాలు వాడటం శ్రేయస్కరం కాదని గ్రహించాలి. ముఖ్యంగా మాత్రలు, ఇంజక్షన్లు, కాపర్-టి వంటి వాటికన్నా కండోమ్స్ వాడటం మాత్రమే మేలన్న విషయం గ్రహించాలి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Last Updated : Feb 24, 2024, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details