ETV Bharat / technology

సూపర్ ఫీచర్లతో ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 సిరీస్!- ఈ ప్రీమియం బైక్స్​ రేటెంతో తెలుసా? - 2025 TRIUMPH SPEED TWIN 1200

ట్రయంఫ్ నుంచి రెండు సరికొత్త మోటార్​సైకిల్స్​- ధర, ఫీచర్ల వివరాలివే!

2025 Triumph Speed Twin 1200
2025 Triumph Speed Twin 1200 (Photo Credit- Triumph India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 28, 2025, 6:46 PM IST

2025 Triumph Speed Twin 1200: ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్ తన లేటెస్ట్ 'స్పీడ్ ట్విన్ 1200' సిరీస్​ను భారత మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ సిరీస్​లో కంపెనీ రెండు మోడల్స్​ను తీసుకుని వచ్చింది. దీని స్టాండర్డ్ వెర్షన్​ ధర రూ. 12.75 లక్షలు కాగా, హై-స్పెక్ RS వేరియంట్ ధర రూ. 15.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు మోడళ్లూ ఒకే ఇంజిన్, మొత్తం స్టైలింగ్, చాలా వరకు ఫీచర్లు ఒకేలా ఉంటాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వీల్స్ భాగాల్లో మాత్రమే ఉంటుంది.

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 ఇంజిన్: స్పీడ్ ట్విన్ 1200, RSలు మునుపటిలాగే పారలల్-ట్వీన్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. కానీ ఈ ఇంజిన్ ఇప్పుడు కొత్త కామ్, స్పోర్టియర్ ట్యూన్, 8,000 rpm అధిక రెడ్‌లైన్‌ను పొందుతుంది. ఈ ఇంజిన్ 7,750rpm వద్ద 103.5bhp శక్తిని, 4,250rpm వద్ద 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేశారు.

ఈ రెండు మోడళ్లు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్​తో వస్తున్నాయి. అయితే ఇందులో RS మాత్రమే బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్​ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్‌తో ట్రయంఫ్ తయారు చేసిన తొలి నియో-రెట్రో బైక్ ఇది. ఈ యూనిట్ వేర్వేరు ఫుట్‌పెగ్ ప్లేస్‌మెంట్‌ను కలిగి ఉన్నందున దీన్ని 'స్టాండర్డ్ 1200'కి అమర్చడం సాధ్యం కాదు.

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200లో మార్పులు: స్పీడ్ ట్విన్ 1200 మోడల్‌లోని ఇన్‌స్ట్రుమెంటేషన్​ను మార్చారు. ట్విన్ డిజి-అనలాగ్ డయల్స్‌ను ట్రైడెంట్ 660 నుంచి LCD/TFT యూనిట్‌తో రీప్లేస్ చేశారు. ఇటీవల విడుదల చేసిన స్పీడ్ ట్విన్ 900తో సహా అనేక మోడళ్లలో కంపెనీ ఈ యూనిట్‌ను ఉపయోగిస్తోంది. ఇక ఈ రెండు స్పీడ్ ట్విన్ మోడళ్లలోనూ స్విచ్ గేర్ ఒకేలా ఉంటుంది. వీటిలో USB-C ఛార్జింగ్ పోర్ట్ స్టాండర్డ్​గా వస్తుంది.

దీని బేస్ స్పీడ్ ట్విన్ 1200 మోడల్ అనేది హై-స్పెక్ RS కంటే తక్కువ బార్స్, ఎక్కువ రియర్‌సెట్ ఫుట్‌పెగ్‌లతో మరింత సౌకర్యవంతమైన ఎర్గోనామిక్స్‌ను కలిగి ఉంది. RS అనేది రెండింటిలోనూ అధిక స్పెక్ వేరియంట్, ఇందులో ఫుల్లీ అడ్జస్టబుల్ మార్జోచి ఫోర్కులు, ఓహ్లిన్స్ షాక్ అబ్జార్బర్లు, 320mm డిస్క్‌లతో బ్రెంబో స్టైల్మా కాలిపర్‌లు ఉన్నాయి.

ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 1200 కలర్ ఆప్షన్స్: కలర్ ఆప్షన్ల గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ స్పీడ్ ట్విన్ 1200 వైట్, రెడ్, సిల్వర్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే RS వేరియంట్ బ్లాక్, ఆరెంజ్ అనే రెండు పెయింట్ జాబ్స్​లో లభిస్తుంది. ఈ రెండు మోడల్స్​లో కూడా కంపెనీ నుంచి ఇతర ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. వాటిలో మొదటిసారిగా ఆన్ బార్స్, అత్యుత్తమ కేఫ్ రేసర్ లుక్ కోసం సోలో సీటు ఉన్నాయి.

ఒప్పో నుంచి మరింత ప్రీమియం స్మార్ట్​ఫోన్- ట్రెండ్ సెట్​ చేస్తూ సరికొత్త డిస్​ప్లేతో!

UPI యూజర్లు జాగ్రత్త!- ఈ ఆప్షన్​ను వెంటనే ఆఫ్ చేయండి- లేకుంటే మీ ఖాతా ఖాళీ!

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ మామూలుగా లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.