Can Beer Drinking Increase Your Weight :బీర్ అనేది జీరో కేలరీ డ్రింక్ ఏమీ కాదు. ఇందులో ఉండే కార్బొహైడ్రేట్స్, ఆల్కహాల్, ఫ్యాట్స్ శరీరంలోకి వెళ్లే కేలరీల సంఖ్యను పెంచేస్తాయి. కాకపోతే బీర్‌ను బట్టి ఆల్కహాల్ కంటెంట్‌తో పాటు కేలరీ సంఖ్య మారుతుంది. 355 మిల్లీ లీటర్ల బీరులో యావరేజ్‌గా 150 కేలరీలు ఉంటాయి. చాలా స్టడీలను బట్టి బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారనేది అవాస్తవమని తేలింది. కాకపోతే బీర్ తాగే అలవాటు ఉన్నవారు వారి డైట్ విషయంలో చేసే నిర్లక్ష్యం వల్ల బరువు పెరుగుతున్నారట. ఎక్కువగా బీర్ తాగడం వల్ల మెటబాలిజంపై ప్రభావం కనిపిస్తుంది. వాటిల్లో ఉండే కేలరీలతో పాటు అదనంగా తీసుకునే ఆహారం కొవ్వులను పెంచేస్తుందట. ఇదంతా ఉదర భాగంలో పేరుకుపోవడం వల్ల పొట్టపైకి వచ్చి బరువు పెరుగుతున్నారనే విషయాన్ని గుర్తు చేస్తుంది.
Beer Side Effects Of Drinking Beer : ఈ సమస్య రాకుండా ఉండాలంటే హైడ్రేట్‌గా ఉండాలని గుర్తుంచుకోండి. బీర్ తాగే అలవాటుతో పాటు నీరు కూడా ఎక్కువ తాగడం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయడమనేది మరువకండి. వాస్తవానికి బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ, ఆల్కహాల్ తీసుకుని బద్దకం అలవడటం వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఫలితంగా మెటబాలిజం దెబ్బతిని క్రమంగా ఆరోగ్యం చెడిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే బీర్ అలవాటు ఉన్నవారు ఎప్పుడో ఒకసారి తీసుకున్నా కూడా, బ్యాలెన్స్‌డ్ డైట్‌తో సమస్య నుంచి బయటపడొచ్చు.