Brushing Teeth Techniques : చాలా మంది జనాలు ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పుటికీ.. దంతాల విషయానికి వస్తే మాత్రం కొంత నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఉదయం నిద్రలేవగానే బద్ధకంగా ఫాస్ట్‌గా బ్రష్ చేసి టిఫిన్ చేస్తుంటారు. దీనివల్ల నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం వంటి పలు రకాల దంత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలురాకుండా ఉండాలంటే సరైన పద్ధతిలో బ్రష్ చేయాలని సూచిస్తున్నారు. అయితే, ఈ స్టోరీలో బ్రషింగ్ టెక్నిక్స్ గురించి ఇప్పుడు చూద్దాం.
బ్రషింగ్ టెక్నిక్స్..
చాలా మందికి సరైన పద్ధతిలో బ్రషింగ్ ఎలా చేయాలో తెలియదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరికీ దీనిపై అవగాహన ఉండటం చాలా ముఖ్యమని అంటున్నారు. అప్పుడే ఎటువంటి దంత సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు.
- మొదట బ్రష్‌పైన పేస్ట్‌ను అప్లై చేసుకుని.. చిగుళ్లపై నుంచి కిందికి, కింది నుంచి పైకి దంతాలను శుభ్రం చేసుకోవాలి.
- తర్వాత దవడ పళ్ల దగ్గర బ్రష్‌ను రౌండ్‌గా తిప్పుతూ దంతాలను క్లీన్ చేసుకోవాలి.
- అలాగే లోపల కూడా దంతాలను కింది నుంచి పైకి, పై నుంచి కిందికి శుభ్రం చేసుకోవాలి.
- దవడ పళ్ల దగ్గర 45 డిగ్రీల కోణంలో బ్రష్ పట్టుకుని శుభ్రం చేసుకోవాలి.
- ఈ విధంగా బ్రష్ చేసుకోవడం వల్ల దంతాల మధ్యలో కూడా క్లీన్ అవుతుంది.
- అలాగే చిగుళ్లకు మసాజ్ అవుతుందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు శరత్ బాబు తెలిపారు.
- ఇలా బ్రష్ చేయడం వల్ల చిగుళ్ల వ్యాధులు రాకుండా నివారించవచ్చని పేర్కొన్నారు.
- ఇంకా దంతాలు రంగు మారకుండా ఉంటాయని అంటున్నారు.