తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇలా చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పీక్స్ - నిరాశ మీ నుంచి పారిపోవడం గ్యారెంటీ

Best Ways to be More Confident : మనం చేసే పనిలో విజయం సాధించాలంటే.. ముందుగా మనకు కాన్ఫిడెన్స్​ ఉండాలి. ఎందరు వ్యతిరేకించినా.. సాధించగలననే నమ్మకం ఉండాలి. మరి దాన్ని ఎలా సాధించాలి? అంటే.. ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. ఈ మార్గాలు ఫాలో అయ్యారంటే మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పీక్​ స్టేజ్​కు చేరుకుంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు!

Best Ways to be More Confident
confident

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 6:57 AM IST

Updated : Feb 25, 2024, 8:57 AM IST

Best Ways to be More Confident : ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవతలి వారిని తట్టుకొని నిలబడాలంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం. లేదంటే మనపై మనకు నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఏ పనీ సరిగా చేయలేం. కానీ, అదే మనపై మనకు పూర్తి విశ్వాసం ఉండాలేగానీ దేన్నైనా సాధించగలమన్న నమ్మకం(Confidence) వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలన్నా.. ఆనందాన్ని పొందాలన్నా కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యం. కానీ చాలా మందిలో కాన్ఫిడెన్స్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. మీది కూడా ఇదే పరిస్థితా? అయితే.. కొన్ని టిప్స్ పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫిజికల్ ఫిట్​నెస్ :శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే కాదు.. కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకోవడానికి ఫిజికల్ ఫిట్​నెస్ చాలా అవసరం. అదేవిధంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఇవి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తాయి. కాబట్టి మీ ఫిట్​నెస్ లక్ష్యాలను సాధించడం కోసం మార్నింగ్ వ్యాయామానికి తప్పకుండా చోటివ్వండి. దీనితోనే మీ రోజు మొదలు కావాలి. ఇందుకోసం జిమ్​, వాకింగ్, యోగా ప్రాక్టీస్ చేయండి.

పుస్తకాలు చదవడం :ఇది కూడా మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది. పుస్తకాలు చదవడం మిమ్మల్ని ఓ ఆసక్తికరమైన వ్యక్తిగా మార్చగలదు. ఇది మీ మేధో వృద్ధిని పెంచడమే కాకుండా జీవితంలో ఎదగడానికి దోహదపడుతుంది. బాగా చదవడం వల్ల మీరు నమ్మకంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఉదాహరణకు, పత్రికలు, పుస్తకాలు, సంపాదకీయాలు చదవడం మీ విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.

కమ్యూనికేషన్ స్కిల్స్ : కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకోవడానికి మీరు చేయాల్సిన మరో పని కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడం. పబ్లిక్ స్పీకింగ్ లేదా వక్తృత్వంలో మంచి వ్యక్తులు ఇతరుల కంటే తెలివిగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. కాబట్టి.. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టండి.

బాడీ లాంగ్వేజ్‌ : ఇది మీ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి, మీరు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించాలంటే.. మీ బాడీ లాంగ్వేజ్‌ చక్కగా ట్యూన్ చేయండి. ఇందుకోసం మీ నడక శైలిని మెరుగుపరచుకోవడమే కాదు మంచి పోశ్చర్​ను మెయింటెయిన్ చేయడం అలవాటు చేసుకోవాలి.

మీ ఆత్మవిశ్వాసం పెరగాలా? ఈ మార్గాలు ట్రై చేయండి!

ఆశావాదం : కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకోవడంలో ఆశావాదాన్ని పెంపొందించుకోవాలి. పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది మిమ్మిల్ని ఆశాజనకంగా ఉంచుతుంది. కాబట్టి అందుకోసం డైలీ సానుకూల ధ్రువీకరణలను ప్రాక్టీస్ చేయండి. ప్రోగ్రెసివ్ లైఫ్ స్టైల్ కలిగి ఉండటానికి మరింత సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోవడం ముఖ్యం!

వ్యక్తిగత పరిశుభ్రత :ఇది కూడా మీ కాన్ఫిడెన్స్​ పెంచి ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతపై దృష్టి పెట్టండి. మీ చర్మ సంరక్షణ, అందం నియమావళికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ శరీర రకం, పరిమాణానికి సరిపోయే దుస్తులను ఎంచుకోండి. దీని వల్ల మీరు ఆకర్షణీయంగా కనిపించడమే కాకుండా మరింత నమ్మకంగా, సంతోషంగా ఉంటారు.

సృజనాత్మక కార్యక్రమాలు :సృజనాత్మకత, ఆవిష్కరణ అనేవి మీ వ్యక్తిత్వానికి మరింత ఛరిష్మాను యాడ్ చేస్తాయి. మీ పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం దృష్టి కేంద్రీకరించండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండండి. ఇందుకోసం రీసెర్చ్ చేయండి. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పీక్ స్టేజ్​లో ఉండం గ్యారంటీ అంటున్నారు నిపుణులు. మరి.. ఇంకెందుకు ఆలస్యం?

మీ పిల్లలు ఆత్మవిశ్వాసం కోల్పోయారా? ప్రధాన కారణం మీరేనట.. ఈ టిప్స్​ ఫాలో అవ్వండి!

Last Updated : Feb 25, 2024, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details