Health Benefits Of Eating Fish : ప్రతిఒక్కరూ తమ ఫేస్ అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ.. చాలా మందిని మొటిమలు వేధిస్తుంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే.. మొటిమలు రాకుండా చేపలు చక్కగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో కూడా ఈ విషయం వెల్లడైంది.
ఇంతకీ పరిశోధన చెప్పే ఆ చేప మందు ఏంటో తెలుసా? ప్రత్యేకంగా ఏమీలేదు.. చేపలు తినడమే! అవును.. చేపలు తినడం ద్వారా.. మొటిమలు తగ్గించుకోవచ్చని ఇటీవల జరిపిన ఓ రీసెర్చ్‌లో తేలింది. చేపల్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చక్కటి మెడిసిన్‌లా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. "Journal of Cosmetic Dermatology" అనే జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ రీసెర్చ్ చేపట్టారు.
ఈ రీసెర్చ్‌లో.. స్వల్పంగా, ఒక మాదిరిగామొటిమలు(Pimples) గలవారిని విశ్లేషించగా.. వారిలో 98% మందిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు కనుగొన్నారు. వీరికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే మధ్యధరా ప్రాంత ఆహారం, మాత్రలను ఇవ్వగా మంచి ఫలితం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా చేపలలో పుష్కలంగా ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఒంట్లో వాపు ప్రక్రియను (ఇన్‌ఫ్లమేషన్) తగ్గిస్తాయి, చర్మంలో నూనె ఉత్పత్తిని నియంత్రిస్తాయి. అంతేకాకుండా.. ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వాపు ప్రక్రియను ప్రేరేపించే రసాయనాలను నిరోధించటం ద్వారా మొటిమలు తగ్గేలా చేస్తాయని ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ బెంజమిన్ క్లానర్ పేర్కొన్నారు.
పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!