Best Diet for Blood Pressure Control :ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బీపీ అదుపులో ఉండేందుకు మందులు వాడడంతో పాటు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తుంటారు. అయినా కొందరిలో రక్తపోటు కంట్రోల్లో ఉండదు. అందుకే బీపీ అదుపులో ఉండాలంటే.. వాటిని ఫాలో అవ్వడమే కాకుండా ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకీ శ్రీనాథ్. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మీరు హైపీతో బాధపడుతున్నట్లయితే ముందుగా మీ శరీర అవసరాలని గుర్తించి అందుకు తగ్గట్లుగా పోషకాహారం తీసుకుంటూ.. వ్యాయామాలూ చేస్తే ఈ సమస్యను సులభంగా అధిగమించొచ్చంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అందులో భాగంగా డైలీ ఆహారపుటలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటంటే.. హెల్దీగా ఉన్న సాధారణ వ్యక్తికి రోజూ చెంచా ఉప్పుతీసుకుంటే సరిపోతుందట. దీంతో పాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఇతర ఖనిజాలూ శరీరానికి అందేలా చూసుకోవాలంటున్నారు. అదేవిధంగా.. ఆహారంలో మేలైన కొవ్వుల మోతాదుని పెంచుకోవడంతో పాటు విటమిన్ ఇ, సి, సెలీనియం, జింక్ వంటివి కూడా తగిన మొత్తంలో అందేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ఇవే కాకుండా రోజువారి తీసుకునే ఆహారంలో ఫోలిక్ యాసిడ్, ఫైటోకెమికల్స్ ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఇవి రక్తాన్ని చిక్కబడనివ్వకుండా కాపాడతాయంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. పొట్టుతో ఉన్న గింజధాన్యాలతో పాటు కాయగూరలు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే, రోజూ కనీసం ముప్పై గ్రాముల నూనెగింజలు, నట్స్ తినేలా చూసుకోవాలంటున్నారు.
"బీపీ" చెక్ చేయించుకోవడానికి వెళ్తున్నారా? - ఈ పొరపాట్లు చేస్తే మీ లెక్కలు తారుమారు!
నూనె ఎక్కువగా తీసుకోవద్దు!