తెలంగాణ

telangana

ETV Bharat / health

సూపర్ న్యూస్: ఐస్ వాటర్​లో ముఖం ముంచారంటే అద్భుత సౌందర్యం! - మీరూ తప్పక ట్రై చేస్తారు! - Ice Water Facial Benefits - ICE WATER FACIAL BENEFITS

Ice Water Facial Benefits : మహిళలు స్కిన్ కేర్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మీరు కూడా అదే పనిలో ఉన్నారా? అయితే ఇటు చూడండి! నేచురల్​గా ఇంట్లోనే ఐస్​ వాటర్ ఫేషియల్ ట్రై చేయండి. మీ చర్మం మంచి నిగారింపును సొంతం చేసుకుంటుందంటున్నారు! అంతేకాదు పలు చర్మ సమస్యలూ దూరమవుతాయని చెబుతున్నారు.

Face Dipping In Ice Water
Ice Water Facial

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 9:50 AM IST

Benefits of Face Dipping in Ice Water :ఇటీవల చాలా మంది మహిళలు అందం కోసం.. గ్లేసియల్ ఫేషియల్ లేదా ఐస్ ఫేషియల్ స్కిన్ కేర్ ట్రీట్​మెంట్ ఫాలో అవుతున్నారు. కొందరు బాలీవుడ్ నటీమణులు సైతం.. మేకప్​ వేసుకునే ముందు ఐస్ వాటర్ ఫేషియల్​ను ఫాలో అవుతున్నారట. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఐస్ వాటర్ ఫేషియల్ అంటే..ఒక పెద్ద బౌల్​లో ఐస్ ముక్కలు వేసి.. అందులో కొన్ని చల్లని వాటర్ పోసుకోవాలి. ఐస్ కాస్త కరిగాక దాంట్లో ముఖం పెట్టి.. కొన్ని సెకన్ల తర్వాత తీయాలి. అలా పలుమార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. అదే ఐస్​ వాటర్ ఫేషియల్. ఇలా చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మేకప్ ఎక్కువసేపు ఉంటుంది :ఫేషియల్ కోసం ఐస్ వాటర్ ఉపయోగించడం వల్ల మీ మేకప్(Makeup) ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. కొరియన్ బ్యూటీ టిప్స్‌లో తరచుగా ఐస్ వాటర్ ఫేషియల్స్ ఉంటాయట. ముఖాన్ని 3 నుంచి 4 నిమిషాల పాటు ఐస్‌ వాటర్​లో ముంచి, ఆ తర్వాత మెత్తటి టవల్​తో స్మూత్​గా తుడుచుకొని.. కాసేపు ఆగిన తర్వాత మేకప్ వేసుకుంటే చాలా సేపు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఎరుపును తగ్గిస్తుంది :చల్లటి నీటిలో ముఖాన్ని ఉంచడం ద్వారా.. చర్మం ఎరుపెక్కే సమస్య తగ్గుతుందట. ఈ ప్రక్రియ వల్ల రక్త ప్రవాహాన్ని కాసేపు నిరోధించడం ద్వారా అండర్ ఐ బ్యాగ్స్, కళ్ల ఉబ్బరం తగ్గుతుందని డెర్మటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ రష్మీ అడెరావ్ చెబుతున్నారు.

వాపును తగ్గిస్తుంది : సూర్యరశ్మి కారణంగా తరచుగా చర్మం ఎరుపు, దురద, చికాకు వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ ఐస్ వాటర్ ప్రక్రియ ద్వారా రక్త నాళాలు సంకోచిస్తాయని, తద్వారా చర్మ సమస్యలు తగ్గుతాయని డాక్టర్ అడెరావ్ చెబుతున్నారు. చర్మం ఎరుపు, ముఖం వాపు, చికాకు వంటి ఇబ్బందులను ఐస్ వాటర్ ఫేషియల్ తగ్గిస్తుందని అంటున్నారు.

మీ చర్మం మెరవాలంటే రాయాల్సింది క్రీమ్స్ కాదు - చేయాల్సింది ఇవీ! - Skin Care Tips

చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తుంది : మీరు ఐస్ వాటర్ ఫేషియల్ ఫాలో అవ్వడం ద్వారా అన్నింటికంటే ముఖ్యంగా పొందే మరో ప్రయోజనమేమిటంటే.. ఇది చర్మ రంధ్రాలను బిగుతుగా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని డాక్టర్ అడెరావ్ చెబుతున్నారు. ఫలితంగా.. చర్మం నునుపుగా మారుతుందని, మురికి, నూనె పేరుకుపోవడం తగ్గుతుందంటున్నారు. అలాగే ఓపెన్ ఫోర్స్ సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. బ్లాక్ హెడ్స్, మొటిమల సమస్య కూడా తగ్గుతుందని అడెరావ్ అంటున్నారు. 'Journal of Cosmetic Dermatology'లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 4 వారాల పాటు రోజుకు రెండుసార్లు ఐస్ వాటర్​తో ముఖం కడుక్కోవడం వలన చర్మ రంధ్రాల పరిమాణం 17% వరకు తగ్గిందని కనుగొన్నారట.

సౌందర్య ఉత్పత్తుల శోషణను పెంచుతుంది :ఐస్ వాటర్ చర్మం శోషణ సామర్థ్యాన్ని పెంచుతుంది. సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు, మాస్క్‌లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులు ప్రభావవంతంగా పనిచేయడంలో చాలా బాగా సహాయపడుతుందని పేర్కొన్నారు. అలాగే.. చర్మంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని, ఫలితంగా చర్మం ప్రకాశవంతంగా తయారవుతుందని డాక్టర్ రష్మీ అడెరావ్ అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. చర్మ సమస్యలున్నవారు, అలాగే సున్నితమైన చర్మం ఉన్నవారు ఈ ఫేషియల్​ను ఫాలో అయ్యేముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది అంటున్నారు.

NOTE :ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ ఫేస్ మిలమిల మెరిసిపోవాలా? - అయితే నైట్​టైమ్ ఇలా చేయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details