Bad Digestion Symptoms : మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసే ముఖ్యమైన భాగం జీర్ణ వ్యవస్థ. ఇది ఆహారాన్ని విఛ్చిన్నం చేసి రసాయన పదార్థాలుగా మార్చి వాటిలోని పోషకాలను శరీరానికి, రక్త ప్రవాహానికి అందిస్తుంది. రక్తప్రవాహం నుంచి పోషకాలు ముందుగా కాలేయానికి చేరుకుంటాయి. కాలేయం ఆ పోషకాలన్నింటినీ సర్దుబాటు చేసి శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శరీరంలోని అన్ని భాగాలు సరిగ్గా పనిచేయాలంటే జీర్ణక్రియ సాఫీగా జరగాలి. జీర్ణవ్యవస్థ పాడైపోయిందంటే అరుగుదల నుంచి బరువు పెరగడం వరకూ చాలా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే జీర్ణవ్యవస్థను ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యంగా ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉండాలి. ఇందుకు మీ శరీరం మీకు కొన్ని సంకేతాలు అందిస్తుంది. తరచూ కొన్ని సమస్యలు మిమల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుందనే అనుకోవాలి.
ఎసిడిటీ
తిన్న తరువాత కడుపులో, ఛాతి భాగంగంలో మంట వస్తుందంటే మీకు యసిడిటీ సమస్య ఉన్నట్లే. ఆమ్లం కడుపులోకి అన్నవాహికలోకి తిరిగి ప్రవేశించినప్పుడు ఈ సమస్య వస్తుంటుంది. తరచుగా మీరు సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే మీ జీర్ణవ్యవస్థలో అసమతుల్యత ఏర్పడినట్లే.
గ్యాస్
సాధారణంగా గ్యాస్ సమస్య అందరికీ ఉంటుంది. కానీ సమస్య తీవ్రతరం అయి తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే మీ జీర్ణారోగ్యం దెబ్బతింటున్నట్లే. మీరు తీసుకుంటున్న ఆహరమే ఇందుకు కారణమై ఉంటుంది. లేదా మీ శరీరం కొన్ని ఆహారాలను సరిగ్గా విచ్ఛిన్నం చేయలేకపోవచ్చు.
ఉబ్బసం
భోజనం తర్వాత కడుపు ఉబ్బినట్లుగా అనిపిస్తుందంటే ఇది మీ జీర్ణవ్యవస్థ అనారోగ్యానికి సంకేతం. గ్యాస్ వంటి ఇతర జీర్ణ రుగ్మతల కారణంగా కడుపు నిండునట్లుగా, బిగుతుగా అనిపించి ఉబ్బసం సమస్య ఎదురవుతుంది.
మలబద్దకం
ప్రేగుల కదలికల్లో తరచూ ఇబ్బంది ఎదురవుతుందా. మలబద్దకం సమస్య తరచూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా. అయితే మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. మీరు తీసుకునే ఆహరంలో ఫైబర్ లేకపోవడం, నిర్జలీకరణం లేదా జీవనవిధానంలో కొన్ని పొరపాట్ల కారణంగా మలబద్దకం సమస్య వస్తుంది.