తెలంగాణ

telangana

ETV Bharat / health

చలికాలంలో ఇది తీసుకుంటే మీ ఇమ్యూనిటీ డబుల్! రోగాలు రాకుండా కాపాడుతుందట! - IMMUNITY MEDICINE IN AYURVEDA

-చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం! -ఇమ్యూనిటీని పెంచేందుకు ఆయుర్వేదంలో ఔషధం

Ayurvedic Medicine for Immunity Booster
Ayurvedic Medicine for Immunity Booster (Getty Images)

By ETV Bharat Health Team

Published : Dec 5, 2024, 4:57 PM IST

Ayurvedic Medicine for Immunity Booster:వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి వివిధ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి వ్యాధులు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలానికి అనుగుణంగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసే ఈ ఔషధాన్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ అంటున్నారు. మరి ఈ ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 500 గ్రాముల ఉసిరికాయ గుజ్జు
  • ఒక చెంచా జాజికాయ చూర్ణం
  • ఒక చెంచా శొంఠి పొడి
  • ఒక చెంచా యాలకుల పొడి
  • ఒక చెంచా దాల్చిన చెక్క పొడి
  • అర కిలో బెల్లం
  • ఒక చెంచా తేనె
  • ఒక చెంచా నెయ్యి

తయారీ విధానం

  • ముందుగా ఉసిరి కాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. ఆ తర్వాత గింజలు తీసి ఉసిరి గుజ్జును తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ వెలిగించి ఓ గిన్నెలో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఉసిరి గుజ్జును వేసి సన్నటి మంటపై వేయించుకోవాలి.
  • అనంతరం బెల్లాన్ని సన్నగా తురుముకొని ఉసిరి గుజ్జులో వేసి కలపి వేయించుకోవాలి.
  • ఈ సమయంలోనే ఓ చిన్న గిన్నెలో జాజికాయ చూర్ణం, దాల్చిన చెక్క, యాలకులు, శొంఠి పొడి వేసి కలపాలి.
  • బెల్లం కరిగిన తర్వాత ముందుగా కలిపిన పొడులను ఇందులో వేసి కలిపి స్టౌ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • దీనిలో తేనె కలిపితే రోగనిరోధక శక్తిని పెంచే ఔషధం రెడీ

ఇమ్యూనిటీ పెంచే ఔషదాన్ని ఎప్పుడు తీసుకోవాలి?
ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఒక చెంచాను తీసుకుని వెంటనే అర కప్పు గోరు వెచ్చని పాలు తాగాలని చెబుతున్నారు. ఇలా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని వివరించారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్స్ ఉపవాసం చేయొచ్చా? ఫాస్టింగ్​తో కలిగే బెనిఫిట్స్ ఏంటి?

కళ్లద్దాలు రోజు పెట్టుకుంటే చూపు మందగిస్తుందా? సైట్ వస్తే తగ్గించుకోవచ్చా? కళ్లకు ఏం తింటే బెస్ట్?

ABOUT THE AUTHOR

...view details