ETV Bharat / state

గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి - కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు - STUDENT DIES OF HEART ATTACK

గుండెపోటుతో 8వ తరగతి విద్యార్థి మృతి - వనపర్తి జిల్లాలో విషాదం - అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన బాలుడు

Student Dies of Heart Attack
Student Dies of Heart Attack (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 2:09 PM IST

Student Dies of Heart Attack : వనపర్తి జిల్లాలో విషాదం జరిగింది. 8వ తరగతి చదువుతున్న బాలుడు గుండెపోటుతో అక్కడికక్కడే పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గోపాల్‌పేటలోని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్‌లో ఏదుట్ల గ్రామానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థికి సోమవారం గుండెపోటు వచ్చింది. ఉదయం 7 గంటలకు చదువుకోవడానికి ఆవరణలో కూర్చున్న బాలుడు 10 నిమిషాల తర్వాత కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ పరీక్ష చేయగా నాడి అందడం లేదని 108 అంబులెన్సులో వనపర్తికి తరలించాలని సూచించారు.

అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి అరుణ గుండెలవిసేలా విలపించారు. గతేడాది తన భర్త, ఇటీవల అత్త మృతి చెందారని, ఇప్పుడు కుమారుడు దూరమయ్యాడని తెలిపారు. బాలుడి స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.