Anemia Deficiency Symptoms : రక్తం మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్లడ్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అది పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దానిని 'ఎనీమియా' అంటారు. శరీరంలో తగినంత ఐరన్ లేకపోవడం, విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే, చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నా, తమకు రక్తహీనత ఉన్నట్లు తెలియదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరినప్పుడు బ్లడ్ టేస్ట్ చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్ ఉందని గుర్తిస్తారు. అయితే, ఇలా కాకుండా రక్త హీనతఉన్న వారు కొన్ని లక్షణాలను గుర్తించి, చికిత్స తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎనీమియా ఉన్నవారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ "డాక్టర్ వుక్కల రాజేష్" (జనరల్ ఫిజీషియన్) చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
లివర్, కిడ్నీ, గుండె వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, ఎక్కువ రోజుల నుంచి మందుల వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా క్యాన్సర్ చికిత్సలో భాగమైన కీమోథెరపీ ట్రీట్మెంట్ చేసుకున్న వారిలో రక్తహీనత వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఏర్పడే ఎనీమియా ఐరన్ లోపం వల్ల ఏర్పడుతుంది. ఆహారం ద్వారా ఐరన్ లభించకపోవడం లేదా శరీరంలోని కణాలు ఆహారంలోని ఐరన్‌ని శోషించకపోవడం వల్ల ఈ రకం ఎనిమియా ఏర్పడుతుంది.
తీవ్రమైన అలసట :
రక్తహీనతతో బాధపడేవారు బాగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ తీవ్రమైన నీరసంతో బాధపడుతుంటారు. రోజువారి పనులకు కూడా అలసిపోతారు. అలాగే వీరిలో చేయాల్సిన పనుల పట్ల ధ్యాస ఉండదు.
తలనొప్పి :రక్తహీనత ఉన్నవారిలో విపరీతమైన తలనొప్పి ఉంటుంది. అలాగే మైకం కమ్మినట్లుగా అనిపిస్తుంది.