తెలంగాణ

telangana

ETV Bharat / health

ఇంట్రస్టింగ్​ - రోజూ ఒక ఉసిరికాయ తింటే - మీ బాడీలో జరిగే మార్పులు ఊహించలేరు! - Amla Health Benefits And Side Effects - AMLA HEALTH BENEFITS AND SIDE EFFECTS

Health Benefits Of Amla In Telugu : ఉసిరి.. ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఉసిరిని రోజూ తింటే మీ బాడీలో పలు మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Amla Health Benefits
Health Benefits Of Amla (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 5:33 PM IST

Amla Health Benefits And Side Effects :ఉసిరిని 'ఇండియన్ గూస్​బెర్రీ' అని కూడా పిలుస్తారు. ఎన్నో పోషకాలకు నిలయమైన దీన్ని సూపర్ ఫుడ్​గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. ఈ పండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఉసిరికాయలను ఎప్పుడో ఒకసారి తింటుంటారు చాలా మంది. అయితే, అలా కాకుండా ఉసిరిని(Amla) రోజూ తీసుకోవడం ద్వారా మీ శరీరంలో పలు మార్పులు జరుగుతాయని నిపుణులు అంటున్నారు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది : ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మీరు రోజూ ఉసిరి తీసుకోవడం వల్ల ముఖ్యంగా దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఇది చర్మంలో కొల్లాజెన్ ఏర్పడడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

2020లో "ఫుడ్ ఫంక్షన్" జర్నల్​లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఉసిరి రసం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జియాన్ షు పాల్గొన్నారు. రోజూ ఉసిరిని తీసుకోవడం ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో చాలా బాగా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఫ్రీ రాడికల్స్ నష్టం తగ్గుతుంది :మీరు రోజూ ఉసిరి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఈ పండులో పాలీఫెనాల్స్, టానిన్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ నుంచి రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. డైలీ ఒక ఉసిరికాయ తింటే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌, కణాల డ్యామేజ్ తగ్గుతుందని చెబుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :డైలీ ఉసిరి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శుభాంగి తమ్మళ్వార్. ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఉసిరి జీర్ణ రసాల స్రావాన్నీ ప్రేరేపించి పోషకాల శోషణను(Absorption) మెరుగుపరుస్తుంది. ఫలితంగా అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయంటున్నారు నిపుణులు.

గుండె ఆరోగ్యానికి మేలు : ఉసిరి ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ లెవల్స్, రక్తపోటును తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయంటున్నారు నిపుణులు. ఫలితంగా గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ధమనులలో ఫలకం పేరుకుపోకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయట.

మొలకలు తింటున్నారా? - మరి, ఈ ప్రమాదాల గురించి తెలుసా? - Sprouts Side Effects

బ్లడ్ షుగర్ లెవెల్స్​ నియంత్రణ :ఉసిరిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి.. మధుమేహం ఉన్న వారికి లేదా వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఉసిరి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.

మెదడు పనితీరు మెరుగు : మీరు రోజూ ఉసిరి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి మెదడు కణాలను రక్షిస్తాయి. అంతేకాదు.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు.

జుట్టు, చర్మ ఆరోగ్యానికి మేలు : ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జుట్ట, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఉసిరికాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందంటున్నారు. అలాగే, ఉసిరి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు స్కిన్‌ ఇరిటేషన్‌, మొటిమలను తగ్గిస్తాయి. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయంటున్నారు.

సైడ్ ఎఫెక్ట్స్ :ఉసిరి రోజూ మితంగా తీసుకునే చాలా మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించవట. కానీ, కొందరిలో జీర్ణ అసౌకర్యం, అతిసారం లేదా అలెర్జీ ప్రతిచర్యలు వంటివి కనిపించవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి, రోజువారీ ఆహారంలో ఉసిరిని యాడ్ చేసుకోవాలని భావించేవారు ముందుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఆపై నిర్ణయం తీసుకోవడం మంచిది అంటున్నారు.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు సమస్యలతో అలసిపోయారా? - ఈ ఒక్క ప్యాక్ ట్రైచేయండి - మీ హెయిర్ రెండింతలు పెరుగుతుంది!

ABOUT THE AUTHOR

...view details