Janhvikapoor House :సినిమా హీరోలకే కాదు హీరోయిన్స్‌కు కూడా చాలా మందే అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. వారితో కలిసి ఒక్క సెల్ఫీ దిగితే చాలని భావిస్తుంటారు. అలాంటిది వారితో కలిసి కాసేపు మాట్లాడే అవకాశం, గడిపే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఇప్పుడు అలాంటి ఆఫర్‌నే జాన్వీ కపూర్ ఇస్తోంది! అవును మీరు చదివేది నిజమే. మీరు జాన్వీ కపూర్ అభిమాని అయితే? ఈ ముద్దుగుమ్మ తన ఇంట్లో మీరు ఉండే అవకాశం కల్పిస్తోంది.
వివరాల్లోకి వెళితే - సెలబ్రిటీలు చాలా మంది షూటింగ్‌లు నిమిత్తం చాలా ప్రదేశాలు తిరుగుతుంటారు. అదే సమయంలో తాము నివాసం ఉండేందుకు చాలా ప్రదేశాల్లో ఇళ్లను కొనుగోలు కూడా చేస్తుంటారు. అలా ప్రస్తుతం చెన్నైలో జాన్వీకి ఓ ఇల్లు ఉంది. దీనిని గతంలో శ్రీదేవి కొనుగోలు చేసిందే. అయితే ఇప్పుడీ ఇంటిని ఎయిర్ బీఎన్బీ అనే పాపులర్ రెంటల్ కంపెనీ లిస్ట్ అవుట్ చేసింది.
ఇద్దరికి ఛాన్స్ - ఫ్యాన్స్ లేదా ఇతర ట్రావెలర్స్ సినీ తారలతో కలిసి ముచ్చటించేలా, అలానే వారి నివాసంలోని కొంత ప్రదేశాన్ని రెంట్‌కు తీసుకునేందుకు వీలుగా ఎయిర్ బీఎన్బీ సంస్థ అవకాశాన్ని కల్పిస్తోంది. అలా గ్లోబల్ వైడ్‌గా ఈ బీఎన్బీ సంస్థ 11 మంది సెలబ్రిటీల లగ్జరీ ఇళ్లను లిస్ట్ చేసింది. ఇందులో చెన్నైలోని జాన్వీ కపూర్‌కు చెందిన విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఎయిర్ బీఎన్బీ సంస్థ వారు జాన్వీ ఇంటికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసి - బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్‌లా జీవించండి అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి ఈ విషయాన్ని తెలియజేసింది.